Juices For Diabetes Patients: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారీనా పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో ఉత్పత్తులున్న ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న విధంగా పలు రకాల పండ్లను తినడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తీవ్ర మధుమేహం సమస్యతో బాధపడుతుంటే పలు రకాల రసాలను తీసుకోవడం మంచిదని శాస్త్రం తెలుపుతుంది. ఆ రసాలేంటో తెలుసుకుందాం.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ రసాలను తప్పనిసరిగా తీసుకోవాలి:
కాకరకాయ రసం:
కాకరకాయ రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి జ్యూస్‌గా చెప్పవచ్చు. ఈ రసం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిండానికి ప్రభావవంతంగా కృషి చేస్తాయి.
ఉసిరి రసం:
ఉసిరి మధుమేహాన్ని నియంత్రించడానికి సమర్థవంతంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు రోజూ ఉసిరి రసాన్ని చక్కెరలో కలిపి తాగాలి. ఇలా ఉదయం, సాయంత్రం తాగడం వల్ల మీబ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
పాలకూర రసం:
షుగర్ పేషెంట్లు పాలకూర రసాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, సి, ఇ పుష్కలంగా లభిస్తాయి. దీని వినియోగం వల్ల శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది.
పొట్లకాయ రసం:
మధుమేహంతో బాధపడేవారు కూడా సొరకాయ రసాన్ని తాగవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్‌లోని చక్కెర అదుపులో ఉంటుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Health Care Tips: ఆహారం తిన్న తర్వాత ఈ వ్యాయామాలు చేయండి.. ఇలా చేస్తే అన్ని సమస్యలు మటు మాయం..!
Also Read: Health Care Tips: అదే పనిగా కాళ్లు కదుపుతున్నారా.. అయితే మీలో ఈ లోపం ఉన్నట్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook