Yadadri Tour On A Low Budget: వేసవికాలంలో చాలా మంది బీచ్‌కి వెళ్లి, సూర్యునిలో విశ్రాంతి తీసుకోవడానికి, లేదా ఆధ్యాత్మికంగా ఉండే ప్రదేశాలను చూడడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే కొన్ని సార్లు ఉద్యోగరీత్యా లేదా వేరే కారణంతోనైనా లీవ్ తీసుకొని వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో కేవలం ఒకే రోజులో చిన్న టూర్ వెళ్లి వచ్చే ప్రదేశాలు ఉంటాయి. అది ఎక్కడ అనుకుంటున్నారా? యాదాద్రి గుట్ట ప్యాకేజీ టూర్ అనే పేరుతో ఒకే ఒక్కరోజులో యాదాద్రిని దర్శించుకునే అవకాశాన్ని తెలంగాణ టూరిజం అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ చాలా అనుకూలంగా ఉండి, తక్కువ ఖర్చుతోనే యాదాద్రిని సందర్శించాలనుకునే భక్తులకు సరైనది.
అయితే ఈ టూర్ ప్యాకేజ ధర ఏంటీ? లాంటి ప్రాంతాలను కవర్ చేయవచ్చు? అనే పూర్తి వివరాలు ఇందులో తెలుసుకుందాం.
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా, మీరు హైదరాబాద్ నుంచి యాదాద్రికి, తిరిగి హైదరాబాద్‌కు మినీ బస్‌లో ప్రయాణిస్తారు. బస్ ఉదయం తొమిది గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్ఓ కార్యాలయం నుంచి బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది.
పది ముప్పైకు కొలనుపాక చేరుకొని అక్కడ ఉండే జైన ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇది తెలంగాణలోని ప్రముఖ జైన క్షేత్రం. ఈ ఆలయం 2వేల ఏళ్ళ నాటిది. అక్కడి నుంచి పదకొండు ముప్పైకు యాదగిరి గుట్టకు చేరుకుంటారు. తరువాత శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది. అనంతరం గుట్ట కింద ఉండే భోజనం చేయడానికి హోటల్ ఉంటాయి. ఈ హోటల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు హోటల్లోనే ఉంటారు.
యాదాద్రి నుంచి నాలుగు గంటలకు బయలుదేరి నాలుగు ముప్పైకు సురేంద్రపురికి చేరుకుంటారు. అక్కడ పేరు పొందిన సత్యనారాయణ కళాధామం సందర్మించి ఏడు ముప్పైకు తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి తొమ్మది ముప్పైకు హైదరాబాద్ చేరుకోవడంతో మీ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధర వివరాలు:
ఈ టూర్ ప్యాకేజీ విషయాలుకు వస్తే తెలంగాణ టూరిజం
పెద్దలకు: వేయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయిలు/- మాత్రమే
పిల్లలకు: వేయి వంద తొంభై తొమ్మిది రూపాయిలు/- మాత్రమే
దర్శనం, ఎంట్రీ టికెట్స్, మధ్యాహ్నం భోజనం ధరలో తెలుసుకోవడం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://tourism.telangana.gov.in/
ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి:
ముందుగా అధికారికి వెబ్ సైట్ పైన క్లిక్ చేయాలి. ఆ తరువాత సెర్చ్ డెస్టినేషన్‌లో యాదాద్రిపైన క్లిక్ చేయండి. అనంతరం తేదిని ఎంచుకోండి. ఈ విధంగా మీరు బుక్ చేయాల్సి ఉంటుంది.
గమనికి:
ఈ టూర్ ప్యాకేజీ మీకు సరైనదా అని నిర్ణయించుకోవడానికి ఈ సమాచారం సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా ఇతర ప్రశ్నలు ఉంటే T-Aadab సేవతో మీ సందేహని అడగవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి