Kaalam Raasi Kathalu: ఎం.ఎన్.వి సాగర్ డైరెక్ట్ చేస్తూ నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ లాంచ్ చేశారు. అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ ఆగస్టు 29న థియేటర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. నటీనటులు కొత్తవాళ్లయిన పరిణితి చెందిన నటన కనబడుతుందన్నారు. ముఖ్యంగా ట్రైలర్లో ఐదు కథల మధ్య ఉన్న లవ్ కంటెంట్ మరియు డైలాగ్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి దర్శక నిర్మాత ఎంఎన్వి సాగర్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా ఎంతో కాన్పిడెంట్ గా తెరకెక్కించారు. ఈ సినిమా యూత్ ని అట్రాక్ట్ చేస్తుందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శక, నిర్మాత ఎం ఎన్ వి సాగర్ మాట్లాడుతూ..
నేను పూరీ జగన్నాథ్ కు ఏకలవ్య శిష్యుడిని. ఆయన తనయుడు ఆకాశ్ పూరీ చేతులు మీదుగా మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా. 60 యేళ్ల తర్వాత పునర్జన్మలో ఊపిరి పోసుకున్న బంధాలు నమ్మకానికి మోసానికి మధ్య బలవుతున్న మనిషి జీవితాల్లో 30 యేళ్ల క్రితం మొదలైన పరువు హత్యల మధ్య ఈ కథ సాగుతుందన్నారు. సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందన్నారు.
మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుని యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గారు రూపొందించిన ఈ చిత్రం ద్వారా చాలా మంది నటీనటులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులకి ఊహలకందని అద్భుతమైన ట్విస్టులు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది
తారాగణం: యమ్ యన్ వి సాగర్ , శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్ ,
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter