అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ఆ దేశ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. గ్రీన్ కార్డులను ప్రతీ సంవత్సరం 45 శాతం పెంచే ప్రతిపాదనతో కూడిన బిల్లును అక్కడి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నారైలలో ఆనందం వెల్లివిరిసింది. ట్రంప్ ప్రభుత్వ మద్దతు పూర్తిస్థాయిలో ఉన్నా.. ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతమున్న వీసా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది.
కాకపోతే ఇక్కడే ఆ ప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది. గ్రీన్ కార్డుల శాతాన్ని పెంచుతున్నా.. అమెరికాకి వలస వచ్చే నిపుణుల అవకాశాలను తగ్గించింది. ప్రస్తుతం ప్రతీ సంవత్సరం దాదాపు 10.5 లక్షల మంది నిపుణులు అమెరికా వలస వస్తున్నారు. ఇక నుండి ఆ సంఖ్యను అమెరికా కేవలం 2.5 లక్షలకే పరిమితం చేయనుంది.
ఈ బిల్లు ప్రకారం ప్రతీ సంవత్సరం 1,20,000 గ్రీన్ కార్డులను మంజూరు చేస్తుండగా.. ఆ సంఖ్యను 1,75,000 లకు పెంచనున్నారు. ప్రస్తుతం భారత ఐటీ ఇంజనీర్లు హెచ్ 1 వీసాతోనే అమెరికాకి వస్తున్నారు. ఆ తర్వాత గ్రీన్ కార్డు పొంది శాశ్వత రెసిడెంట్లుగా మారుతున్నారు. కొత్త చట్టం వస్తే వీరి ఆశ పండినట్లే..