30 Heavy Feet King Cobra: స్నేక్ క్యాచర్లను ఆటాడుకున్న కింగ్ కోబ్రా.. చివరకి ఏం జరిగిందంటే..?

30 Feet King Cobra: థాయిలాండ్‌లో ఓ స్నేక్ క్యాచర్స్  బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఈ 30 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకోటానికి ఇద్దరి స్నేక్ క్యాచర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.

Written by - P Sampath Kumar | Last Updated : Mar 21, 2023, 03:55 PM IST
  • 16 కింగ్ భారీ కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని విన్యాసాలు
  • మెంటలెక్కించే వీడియో..
  • వీడియోకి 395,658 వ్యూస్..
30 Heavy Feet King Cobra: స్నేక్ క్యాచర్లను ఆటాడుకున్న కింగ్ కోబ్రా.. చివరకి ఏం జరిగిందంటే..?

30 Feet Black King Cobra Video: సాధారణంగా పాములు వర్షం పడిన వెంటనే పుట్టలోంచి బయటికి వస్తాయి. పుట్టలోకి వర్షపు నీరు చేరడం, పుట్టలో వేడిగా ఉన్న కారణంగా బయటికి వస్తాయి. వర్షం పడగానే చల్లదనానికి పాములు బయట సంచరిస్తుంటాయి. ఇలా బయటికి వచ్చిన పాములు మనిషి కంట పడితే.. కొందరు చంపేస్తుంటారు. మరికొందరు మాత్రం బయపడి స్నేక్ క్యాచర్‌లకు సమాచారం ఇస్తుంటారు. స్నేక్ క్యాచర్‌లు పామును చాలా ఈజీగా పెట్టేస్తుంటారు. తాజాగా ఓ స్నేక్ క్యాచర్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారీ పాములను పట్టే స్నేక్ క్యాచర్‌లకు ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు స్టిక్ సాయంతో పడితే.. ఇంకొందరు ఒట్టిచేతులతోనే పట్టేస్తారు. థాయిలాండ్‌కు చెందిన ఓ స్నేక్ క్యాచర్‌ భారీ కింగ్ కోబ్రాలను కూడా సునాయాసంగా పడుతాడు. కింగ్ కోబ్రాను మభ్యపెట్టి మరీ పట్టేశాడు. పాము ముందు ఒకరిని నిలబెట్టి దాని దృష్టిని మళ్లిస్తాడు. వెనకాల నుంచి నెమ్మదిగా వచ్చే అతడు ఒక్కసారిగా పడగవిప్పిన పాము తలను పెట్టేస్తాడు. ఆపై దాన్ని సంచిలో బందిస్తాడు. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. థాయిలాండ్‌లో వర్షాకాల సమయంలో ఓ ఫామ్ ఆయిల్ తోటలో దాపుగా 30 అడుగుల కింగ్ కోబ్రా యజమానికి కనిస్తుంది. యజమాని స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా.. వెంటనే అతడు తోటకు వస్తాడు. ముందుగా కింగ్ కోబ్రా తోకను ఒకరు పట్టుకుని ఉండగా.. ముందునుంచే దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అది అసలు సాధ్యం కాదు. కాసేపటి అనంతరం ఒకతను పాము ముందుండి దాని దృష్టిని తనవైపు తిప్పికుంటాడు. వెనకాల నుంచి స్నేక్ క్యాచర్‌ వచ్చి దాని తలను పెట్టేస్తాడు. 

కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్‌ తన మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఆపై దానిని సంచిలో బందించి అడవిలో వదిలేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబందించిన వీడియోను 'Nick Wildlife' అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. మూడు నెలల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి 395,658 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తోంది. నీ ధైర్యానికి పెద్ద హ్యాట్సాఫ్ బాసూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Naga Chaitanya Custody Teaser: నన్ను చావు వెంటాడుతోంది.. ఆసక్తికరంగా నాగచైతన్య 'కస్టడీ' టీజర్‌!

Aslo Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెర.. డీఏ పెంపుపై నేడే ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News