Crocodile attacks on elephant video: సాధారణంగా అడవిలోని జంతువులు తరచుగా సరస్సులలో నీళ్లు తాగుతుంటాయి. అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. క్రూర జంతువులతో పాటు, సాధు జంతువులు కూడా ఉంటాయి. సరస్సులలో మొసళ్లు ఎక్కువగా ఉంటాయి. నీళ్లు తాగేందుకు వచ్చిన జంతువులపై దాడులు చేస్తుంటాయి. కొన్ని సార్లు జంతువులు ఒక చోట నుంచి మరోక చోటికి వెళ్లేందుకు సరస్సులు దాటాల్సి ఉంటుంది.
ఈక్రమంలో నీళ్లలో జంతువులు దిగగానే.. మొసళ్లు మూకుమ్మడిగా దాడులు చేస్తుంటాయి. నీళ్లలో మొసళ్లకు పదేనుగుల ఏనుగుల బలం ఉంటుందని చెప్తుంటారు. అది దాని స్థాన బలం. అదే మొసలి బైటకు వస్తే మాత్రం అంతగా ప్రభావం చూపించదని చెప్పుకొవచ్చు. అందుకే మొసలి నీళ్లలో ఉంటే.. సింహాం, పులులు, ఏనుగుల వంటి బలమైన జంతువులు సైతం వాటికి జోలికి పోయేందుకు సాహాసం చేయవు.
ఒక ఏనుగుల గుంపు నీళ్లను తాగేందుకు అడవిలోకి సరస్సు దగ్గరకు వచ్చింది. దానిలో అప్పటికే మొసళ్లుఉన్నాయి. ఏనుగులు నీళ్లలోని దిగగానే అక్కడున్న మొసళ్లు ఏనుగులపైకి దాడి చేశారు. ఒక మొసలి ఏనుగు.. తొండం పట్టుకుని దాన్ని నీళ్లలోనికి లాగేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. కానీ ఏనుగు మాత్రం తగ్గెదెలా అన్నట్లు మొసలిపట్టును విడిపించుకుని నీళ్లలోకి నెట్టేసింది.
తన కాలితో మొసలిని నీళ్లలోని తొక్కుతూ చుక్కలు చూపించింది. ఏనుగుమీద దాడి చేసేందుకు చూసిన మొసలికి రివర్స్ లో కౌంటర్ పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మొసలికి భలే చుక్కలు చూపించిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు స్థానబలం ప్రతిసారి పనిచేయదని కౌంటర్ లు ఇస్తున్నారు.