Pushpa and shekhawat duplicates spotted in Indore video: పుష్ప2 మూవీ అనేక రికార్డులను తిరగరాస్తుంది. ఒక వైపు భారీగా వసూళ్లను రాబడుతూ.. అదే విధంగా కాంట్రవర్సీ అంశాలతో కూడా వార్తలలో ఉంటుంది. పుష్ప2 మూవీలోని ప్రతిపాట, డైలాగ్ లు, డ్యాన్స్ లు సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబడుతుంది. ఇదిలా ఉండగా..ఈ మూవీలో అల్లు అర్జున్, విలన్ ఫహాద్ ఫాజిల్ పాత్రలు సినిమాకే హైలేట్ అని చెప్పవచ్చు.
इंदौर
पुष्पा बनना पुलिस वाले को पड़ा भारी, इंदौरी शेखावत को पुलिस के वरिष्ठ अधिकारियों ने किया तलबइंदौरी शेखावत ने गलती मानकर आगे से ऐसा ना करने की बात कही है pic.twitter.com/roiJdzI1AJ
— Avinash Tiwari (@TaviJournalist) January 21, 2025
ఈ మూవీలోని ఫహజ్ ఫాజిల్ పాత్ర భన్వర్ సింగ్ షేకావత్ కూడా కాంట్రవర్సీగా మారింది. ఈ మూవీలో భన్వర్ సింగ్ షెకావత్, పుష్ప అల్లు అర్జున్ పాత్రను గుర్తుకు తెచ్చే విధంగా ఇద్దరు వ్యక్తులు ఇండోర్ లో హల్ చల్ చేశారు. వీళ్లను చూసిన అక్కడి వారంత.. నిజమైన షెకావత్, పుష్ప అనుకున్నారు.
ఒకతను అచ్చం పుష్పలా, మరో వ్యక్తి పోలీస్ డ్రెస్ లో, గుండుతో షెకావత్ లా కనిపించారు. పుష్ప గెటప్‌లో ఉన్న సినిమాల్లో లాగా మీసం తిప్పుతు, తగ్గెదెలా అన్న విధంగా ఫోజ్ కొట్టాడు. బైక్ మీద షెకావత్ లారెడీ అయిన వ్యక్తి బైక్ మీద సిగరేట్ తాగుతు కన్పించారు.
ఈ వింత ఘటనను చాలామంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.‘పుష్ప, షెకావత్ ఇద్దరూ కలిశారు’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..షెకావత్ లా కనిపించిన వ్యక్తి నిజానికి పోలీసు కానిస్టేబుల్, అతడి పేరు జితేంద్ర తన్వర్. పోలీస్ రేడియో ట్రైనింగ్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. వీరి వీడియోలు పోలీసు ఉన్నతాధికారుల వరకు వెళ్లాయి వెంటనే అతనిపైశాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.
ఆ ఇద్దరికీ హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు జరిమానా విధించారు. విధుల్లో ఉండి.. ఇలాంటి పనులు చేసినందుకు పోలీసులు సీరియస్ గా ఉన్నారు. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగినందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా జరిమానా వేశారు. ఈ క్రమంలో సరదాగా అనవసర పనులు చేసి.. వీరిద్దరు ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఈవీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter