Post Ganesha:
ఈ ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా.. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లా రణథంబోర్‌లో వెలసి ఉంది ఈ ఆలయం. అంతేకాదండోయ్ భారతదేశంలోని తొలి నాయకుడి ఆలయంగా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గంభీరంగా నిలబడిన ఆరావలి ,వింధ్య పర్వతాల సంగమ స్థానం లో కొలువై ఉన్న ఈ పవిత్రమైన ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఇంట్లో ఎటువంటి శుభకార్యం చేపట్టిన మంది. ముందుగా ఇక్కడ స్వామికే ఆహ్వానం పంపుతారట.
అంతేకాదు జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు , సమాధానం దొరకనప్పుడు స్వామిని శరణు వెళితే వెంటనే ఫలితం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఇక్కడి భక్తులు ఏ చిన్న సమస్య ఎదురైనా సరే స్వామి పై ఉన్న అపారమైన నమ్మకంతో స్వామికి ఉత్తరం రాసి పంపుతారు. సంపూర్ణమైన విశ్వాసం తో స్వామికి లిఖితపూర్వకంగా రాసి తమ సమస్యలను విన్నవించుకుంటే స్వామి స్వయంగా వచ్చి పరిష్కరిస్తాడు అని ఇక్కడి భక్తుల నమ్మకం.
అసలు ఈ నమ్మకం ఎలా ఏర్పడిందో తెలుసా? అప్పట్లో అంటే 1299 - 1301 మధ్య కాలంలో అన్నమాట.. అప్పట్లో ఈ ప్రదేశాన్ని స్థానికంగా పాలిస్తున్న మహారాజు
హమీర్ దేవ్ చౌహాన్ కు ఢిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ తో ఘర్షణ మొదలైంది. దీంతో ఖిల్జీ అపారమైన తన సేనతో వచ్చి రణథంబోర్ కోటను ముట్టడించాడు. కొన్ని రోజులకి కొండమీద ఉన్న కోటలు కనీసం నిత్యవసరాలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇదే కొనసాగితే శత్రువుల వల్ల కంటే కూడా ప్రజలు ఆకలితోటే చచ్చిపోయేలా ఉన్నారు. ఇక చేసేది లేక ..దిక్కు తోచక సతమతమవుతున్న రాజుకి కలలో కనిపించిన గణనాయకుడు.. కోట గోడలో గోప్యంగా ఉన్న తన విగ్రహాన్ని తీసి పూజించమని ఆదేశించారట.
మరుసటి రోజు రాజు ఆ ప్రదేశాన్ని కనిపెట్టి కోటగోడను పగలగొట్టించి వినాయకుడి విగ్రహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత పూర్తి భక్తిశ్రద్ధలతో స్వామికి పూజ చేశాడు. ఆశ్చర్యంగా మరుసటి రోజుకి ఖిల్జీ సేనలు ఆ ప్రదేశం నుంచి స్వచ్ఛందంగా వెనుదిరిగాయి. అలా అప్పటినుంచి కష్టాలు తీర్చే గణపయ్యగా ఈ వినాయకుడు ప్రసిద్ధి చెందాడు.
అయితే ప్రస్తుతం ఈ ఆలయం రణథంబోర్ టైగర్ రిజర్వ్ మధ్య ప్రాంతంలో కొలువైంది. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే సవాయి మాధోపూర్ స్టేషన్ వరకు ట్రైన్లో చేరుకుంటే.. అక్కడ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక మీరు మీ సమస్యను స్వయంగా స్వామికి రాసి పంపాలి అనుకుంటే ఇదిగో ఈ కింద చిరునామా ను గుర్తుపెట్టుకోండి.. రణథంబోర్ త్రినేత్ర గణేశ ఆలయం, సవాయి మాధోపూర్, రాజస్థాన్ - 322021.
Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.