Solar Eclipse 2022: ఈ సంవత్సరం రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబరు 25న ఏర్పడబోతుంది. ఈ గ్రహణానికి ఒక్కరోజు ముందుగానే మనం దీపావళిని జరుపుకుంటాం. ఈ ఏడాదిలో మెుదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న సంభవించింది. గోవర్ధన పూజ రోజున వచ్చే ఈ సూర్యగ్రహణం (Solar Eclipse 2022) మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ గ్రహణం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహణ సమయంలో ఈ 5 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభం (Taurus): సూర్యగ్రహణం కారణంగా ఈ రాశివారికి సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. ఈ సమయంలో సానుకూల దృక్పథాన్ని అలవరచుకోండి. దీని కోసం ప్రార్థన, ఆరాధన, ధ్యానం చేయండి. ఈ గ్రహణ సమయంలో ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి.
మిథునం (Gemini): ఈ సూర్యగ్రహణం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉండదు. ఆర్థికంగా నష్టాలు చవిచూస్తారు. కాబట్టి ఈ సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోండి. అదృష్టం మీకు కలిసిరాదు. ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఈ సమయం అంతగా కలిసిరాదు.
కన్య (Virgo): ఈ రాశివారికి సూర్యగ్రహణం హాని కలిగిస్తుంది. విదేశాలకు సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి.
తుల రాశి (Libra): సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు, కాబట్టి ఈ రాశి వారిపై గ్రహణం గరిష్ట ప్రభావాన్ని చూపుతుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో హృదయ సంబంధిత రోగులు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం (Scorpio): వృశ్చికరాశి వారికి ఈ సూర్యగ్రహణం డబ్బు, బంధుత్వాల పరంగా నష్టం కలిగిస్తుంది. ఆదాయం తగ్గవచ్చు. ధన నష్టం కలగవచ్చు. కుటుంబంలో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. ఈ సమయంలో ఆచితూచి మాట్లాడండి, లేకపోతే మీకు హాని జరుగుతుంది.
Also Read: Surya Gochar 2022: దీపావళికి ముందు రాశిని మార్చబోతున్న సూర్యభగవానుడు.. ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి