Sun Transit 2022 Effect: సూర్యభగవానుడు..తండ్రి, ఆత్మ, ధైర్యానికి కారకుడు. సెప్టెంబర్ నెలలో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. సెప్టెంబరు 17, శనివారం నాడు సూర్యదేవుడు తన సొంత రాశి అయిన సింహరాశిని విడిచిపెట్టి ఉదయం 07:11 గంటలకు కన్యారాశిలోకి (Sun transit in Virgo 2022) ప్రవేశించనున్నాడు. కన్యా రాశిలో సూర్యుని సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. సూర్య సంచారం ఏ రాశివారికి శుభప్రదమో తెలుసుకుందాం.
మేషం (Aries)- సూర్యుడు ఈ రాశిచక్రంలోని ఆరో ఇంట్లో సంచరిస్తాడు. సూర్యభగవానుడు సంచారం ఈ రాశివారికి కలిసి వస్తుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer)- కర్కాటక రాశి యొక్క మూడవ ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. ఈ రాశివారి కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం (Scorpio)- సూర్యభగవానుడు ఈ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు. సూర్యుని సంచార సమయం ఈ వ్యక్తుల జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తాడు. జాబ్ వస్తుంది. కెరీర్ లో విజయం సాధిస్తారు.
ధనుస్సు (Sagittarius)- ధనుస్సు రాశి వారి దశమ స్థానంలో సూర్య దేవుడు కూర్చుంటాడు. సూర్య సంచార ప్రభావంతో మీరు మీ కెరీర్‌లో శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టంతో మీ పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
Also Read: Santana Saptami Vratam 2022: సంతాన సప్తమి వ్రతం ఎప్పుడు, శుభ సమయం, ప్రాముఖ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook