Cricketer Andrew Flintoff air lifted to hospital after Car Crash in BBC Top Gear Show: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఫ్లింటాఫ్ కారు రోడ్డు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఫ్లింటాఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ప్రస్తతం అతడు లండన్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. 'టాప్ గేర్' షో ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు ప్రమాదంకు గురైంది.
ఆండ్రూ ఫ్లింటాఫ్ 2010లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటినుంచి టెలివిజన్ రియాలిటీ షోలలో రెగ్యులర్‌గా ప్లాగొంటున్నారు. 2019లో ప్రఖ్యాత బీబీసీ స్పోర్ట్స్ షో 'టాప్ గేర్'లో హోస్ట్‌గా చేరారు. సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ఏరోడ్రోమ్‌లో సోమవారం ఫ్లింటాఫ్ కారు ప్రమాదంకు గురైంది. షో టెస్ట్ ట్రాక్‌లలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఫ్లింటాఫ్ను అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. గాయాలు అయినా.. ఫ్లింటాఫ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
'ఈరోజు ఉదయం టాప్ గేర్ టెస్ట్ ట్రాక్ వద్ద జరిగిన ప్రమాదంలో ఫ్రెడ్డీ (ఆండ్రూ ఫ్లింటాఫ్) గాయపడ్డాడు. సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఫ్లింటాఫ్ అతి వేగంతో డ్రైవింగ్ చేయలేదు. అదే ప్రాణాంతక గాయాలు కాకుండా సహాయపడింది. సిబ్బంది అన్ని ఆరోగ్య మరియు భద్రతా చర్యలను తీసుకుపోవడం కూడా హెల్ప్ అయింది. చిత్రీకరణ ప్రస్తుతానికి వాయిదా వేయబడింది' అని బీబీసీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
'టాప్ గేర్' షో ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు 125mph వేగంతో వెళుతున్నట్లు సమాచారం. 2019 కూడా ఫ్రెడ్డీ ప్రమాదంకు గురయ్యాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 3845 రన్స్, 226 వికెట్స్.. వన్డేల్లో 3394 రన్స్, 169 వికెట్స్.. టీ20ల్లో 76 రన్స్, 5 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ తరఫున మంచి ఆల్‌రౌండర్‌గా ఫ్రెడ్డీ గుర్తింపు తెచ్చుకున్నాడు.
Also Read: IND VS BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. టాస్ నెగ్గిన భారత్! యువ ఆటగాళ్లకు నిరాశే
Also Read: BRS Central Office: నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం.. మంత్రి కేటీఆర్ డుమ్మా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.