India Playing XI for 1st ODI vs Australia 2023: సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023ని భారత్ 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్‌కు చేరిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. శుక్రవారం (మార్చి 17) నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ముంబై వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. భారత్ వేదికగానే 203 వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను మెగా టోర్నీకి సన్నాహకంగా వాడుకోవాలని భారత్ చూస్తోంది. తొలి వన్డే నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌ను (IND Playing XI vs AUS) ఓసారి చూద్దాం.
భారత్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరం అయ్యాడు. దాంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి వన్డేలో జట్టును నడిపించనున్నాడు. రోహిత్ గైర్హాజరీలో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ బాదిన గిల్.. అదే ఫామ్ ఆస్ట్రేలియాపై చూపాలని చూస్తున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ చేసిన కిషన్.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు యువ ఓపెనర్లు పరుగులు చేస్తే మంచి ఆరంభం దక్కనుంది.
మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. నాలుగో టెస్టులో సెంచరీ బాదిన కోహ్లీపై మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనుండగా.. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. వెన్ను గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరమవడంతో సూర్యకు లైన్ క్లియర్ అయింది. టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటిన సూర్య.. వన్డేల్లో నిరూపించుకోవాల్సి ఉంది. ఫేమ్ లేమితో సతమతం అవుతున్న రాహుల్ కూడా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో.. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు.
వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. దాంతో ఈ మ్యాచులో భారత్ మొత్తం ముగ్గురు ఆల్‌రౌండర్‌లతో బరిలోకి దిగనుంది. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఆడటం ఖాయం. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కుల్దీప్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
భారత్ తుది జట్టు (అంచనా) IND Playing XI:
ఇషాన్ కిషన్ (కీపర్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ.
Also Read: Hyundai Creta Price 2023: కేవలం 4 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు! వెంటనే కోనేయండి
Also Read: Mars Transit 2023: మిథున రాశిలో కుజ సంచారం.. ఈ 4 రాశుల వారు మే 10 వరకు జాగ్రత్తగా ఉండాలి! భారీ నష్టం తప్పదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.