India Vs Sri Lanka: నేడే శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్.. ఈ ప్లేయర్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్‌..!

IND Vs SL 2nd T20 Match Preview: శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు సంజూ శాంసన్ గాయం నుంచి దూరమయ్యాడు. దీంతో తుది జట్టులో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మార్పులు చేయనున్నాడు. శాంసన్ ప్లేస్‌లో జట్టులోకి వచ్చేది ఎవరంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 07:48 AM IST
  • శ్రీలంకతో నేడు రెండో మ్యాచ్
  • గాయంతో సంజూ శాంసన్ దూరం
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్
India Vs Sri Lanka: నేడే శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్.. ఈ ప్లేయర్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్‌..!

IND Vs SL 2nd T20 Match Preview: న్యూఇయర్‌లో తొలి సిరీస్‌ విజయానికి భారత్ సిద్ధమవుతోంది. శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం పుణె వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంజూ శాంసన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. 

తొలి మ్యాచ్‌లో విఫలమైన శుభ్‌మన్ గిల్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ఇషాన్ కిషన్‌కు తోడుగా గిల్ మరోసారి ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. పవర్ ప్లేలో వీరిద్దరు దూకుడుగా ఆడితే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. మొదటి మ్యాచ్‌లో నిరాశపర్చిన వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై పుణెలో చెలరేగాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో  రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. నాలుగో స్థానంలో ఈ యంగ్ క్రికెటర్ ఆడనున్నాడు.

కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మరోసారి బ్యాటింగ్‌లో కీలకం కానున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైతే భారం అంతా పాండ్యాపైనే పడుతుంది. గత మ్యాచ్‌లో చితక్కొట్టిన దీపక్ హుడా, అక్షర్ పటేల్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. స్పిన్నర్ చాహల్ తుదిజట్టులో ఉండడం ఖాయం. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన శివమ్ మావిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. మావి 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్‌లోనూ అందరి కళ్లు మావిపైనే ఉండనున్నాయి. స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కూడా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. అయితే హార్షల్ పటేల్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్ ఫిట్‌గా ఉంటే హర్షల్ పటేల్ స్థానంలో అతనికి అవకాశం ఇవ్వవచ్చు. 

శ్రీలంకతో విజయం అంతా తేలిక కాదని మొదటి మ్యాచ్‌లోనే టీమిండియాకు అర్థమైపోయింది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు స్పిన్నర్లు హసరంగ, తీక్షణ, ధనంజయ భారత బ్యాట్స్‌మెన్లను బాగా ఇబ్బంది పెట్టారు. పుణె పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో వీరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ షనక, కుశాల్ మెండిస్‌కు తోడు ఇతర బ్యాట్స్‌మెన్ కూడా రాణించాలని శ్రీలంక మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఆల్‌రౌండర్లతో కూడిన శ్రీలంక రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ సమం చేయాలని చూస్తోంది. 

Also Read: Sanju Samson: శ్రీలంక సిరీస్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. యంగ్ క్రికెటర్‌కు చోటు   

Also Read: Pawan Kalyan: చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. సీఎం జగన్‌పై ఆగ్రహం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News