భారత్ - కివీస్ వన్డే సిరీస్ లో భాగంగా పుణెలో జరిగిన రెండో వన్డేలో కోహ్లీసే విజయభేరి మ్రోగించింది. కివీస్ పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. తొలత బ్యాటింగ్ కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు మాత్రమే చేయగల్గింది. పేస్ బౌలర్ భువనేశ్వర్ (3/45 ) కివీస్ ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించగా..బుమ్రా (2/38), చాహల్ (2/3) తమ వంతు తోడ్పాడునందించారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవలర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ధవన్ (68), దినేష్ కార్తీక్ (64) అర్థశతకాలతో రాణించారు . కాగా ఈ మ్యాచ్ విజయం సాధించి కోహ్లీసేన సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది. తొలి వన్డేలో కివీస్ చేతిలో కోహ్లీ సేన పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా మ్యాచ్ లో విశేషంగా రాణించిన భువనేశ్వర్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.