ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఫైనల్ మ్యాచ్ ఆరంభం అయింది. ట్రోఫీ కోసం కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
IPL 2022 Final GT vs RR. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఆరంభం అయింది. ట్రోఫీ కోసం కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఫైనల్ మ్యాచ్ ఆరంభం అయింది. ట్రోఫీ కోసం కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
అరంగేట్రం సీజన్‌తోనే టైటిల్ అందుకున్న గుజరాత్ టైటాన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. తొలి సీజన్లో టైటిల్ గెలిచిన జట్టుగా రాజస్థాన్ నిలవగా.. ఆ తర్వాత గుజరాత్ రికార్డుల్లో నిలిచింది. మరోవైపు 2008 తర్వాత మరోసారి కప్ గెలవాలన్న రాజస్తాన్ రాయల్స్ కోరిక నెరవేరలేదు.
ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శుభమాన్ గిల్ (45), డేవిడ్ మిల్లర్ (32), హార్దిక్ పాండ్యా (34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహల్, బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ తలో ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ చేసిన 39 పరుగులే అత్యధిక స్కోర్.
ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (39), డేవిడ్ మిల్లర్ (32) క్రీజులో ఉన్నారు. 17వ ఓవర్లో మిల్లర్ రెండు ఫోర్లు బాదాడు.
17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (37), డేవిడ్ మిల్లర్ (29) క్రీజులో ఉన్నారు. 17వ ఓవర్లో మిల్లర్ రెండు ఫోర్లు బాదాడు. గుజరాత్ గెలవాలంటే ఇంకా 18 బంతుల్లో 9 రన్స్ కొట్టాలి.
16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (37), డేవిడ్ మిల్లర్ (17) క్రీజులో ఉన్నారు. గుజరాత్ గెలవాలంటే ఇంకా 24 బంతుల్లో 22 రన్స్ కొట్టాలి.
15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (33), డేవిడ్ మిల్లర్ (9) క్రీజులో ఉన్నారు. గుజరాత్ గెలవాలంటే ఇంకా 30 బంతుల్లో 34 రన్స్ కొట్టాలి.
14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (31), డేవిడ్ మిల్లర్ (3) క్రీజులో ఉన్నారు.
13 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (31), హార్దిక్ పాండ్యా (32) క్రీజులో ఉన్నారు.
12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (29), హార్దిక్ పాండ్యా (31) క్రీజులో ఉన్నారు. ఆర్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో హార్దిక్ ఓ ఫోర్. సిక్స్ బాదాడు.
11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (26), హార్దిక్ పాండ్యా (16) క్రీజులో ఉన్నారు.
సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (23), హార్దిక్ పాండ్యా (11) క్రీజులో ఉన్నారు.
9వ ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (19), హార్దిక్ పాండ్యా (9) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో గిల్ రెండు ఫోర్లు బాదాడు.
8వ ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు కోల్పోయి 39 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (15), హార్దిక్ పాండ్యా (4) క్రీజులో ఉన్నారు. చహల్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి.
7వ ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు కోల్పోయి 35 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (12), హార్దిక్ పాండ్యా (3) క్రీజులో ఉన్నారు. ఒబెడ్ మెక్కాయ్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
6వ ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు కోల్పోయి 31 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (10), హార్దిక్ పాండ్యా (1) క్రీజులో ఉన్నారు. చహల్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.
5వ ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు కోల్పోయి 25 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (5), హార్దిక్ పాండ్యా (0) క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 5వ ఓవర్ మూడో బంతికి మాథ్యూ వేడ్ ఔట్ అయ్యాడు. ఈ సీజన్లో వేడ్ మరోసారి నిరాశపరిచాడు.
4వ ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (8), మాథ్యూ వేడ్ (4) క్రీజులో ఉన్నారు. ప్రసిద్ వేసిన ఈ ఓవర్లో ఓ సిక్స్ వచ్చింది.
మూడో ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (4), మాథ్యూ వేడ్ (2) క్రీజులో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు.
రెండో ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (4), మాథ్యూ వేడ్ (2) క్రీజులో ఉన్నారు.
మొదటి ఓవర్ ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ (4), వృద్ధిమాన్ సాహా (1) క్రీజులో ఉన్నారు.
శుభ్‌మన్ గిల్‌కు అదృష్టం కలిసొచ్చింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికి గిల్ ఇచ్చిన క్యాచును చహల్ వదిలేశాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుండి నడిపించాడు. తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఐపీఎల్ 2022లో రాజస్థాన్ 130 పరుగులు చేయగా.. 2017లో ముంబై ఇండియన్స్ 129 రన్స్ చేసింది.
ఐపీఎల్ 2022 ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ చేసిన 39 పరుగులే అత్యధిక స్కోర్. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్ రెండు వికెట్లు తీశాడు.
19 ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (8), ఒబెడ్ మెక్‌కాయ్ (8) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో కేవలం మూడు రన్స్ మాత్రమే వచ్చాయి.
18 ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ ఏడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (6), ఒబెడ్ మెక్‌కాయ్ (7) క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్ మూడో బంతికి ట్రెంట్ బౌల్ట్ ఔట్ అయ్యాడు.
ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ ఔట్ అయ్యాడు. 16 ఓవర్ ఐదో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు. 13వ ఓవర్ మొదటి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు.
12 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (39), దేవదత్ పడిక్కల్ (0) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో బట్లర్ రెండు ఫోర్లు బాదాడు.
ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ ఔట్ అయ్యాడు. 1వ ఓవర్ ఐదవ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. పడిక్కల్ 9 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
11ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ 75 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (37), యశస్వి జైస్వాల్ (0) పరుగులు చేసారు. ఈ ఓవర్లో ఒక బౌండరీ కూడా రాలేదు. 7 బంతులు ఆడిన యశస్వి ఇంకా ఖాతానే తెరవలేదు.
సగం ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (34), దేవదత్ పడిక్కల్ (0) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో బట్లర్ రెండు ఫోర్లు బాదాడు.
తొమ్మిదో ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ రెండు వికెట్లు కోల్పోయి 60 రన్స్ చేసింది. జోస్ బట్లర్ (23), దేవదత్ పడిక్కల్ (0) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది.
ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఔట్ అయ్యాడు. తొమ్మిదో ఓవర్ రెండో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఎనమిది ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 59 రన్స్ చేసింది. జోస్ బట్లర్ (22), సంజు శాంసన్ (14) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 54 రన్స్ చేసింది. జోస్ బట్లర్ (19), సంజు శాంసన్ (12) క్రీజులో ఉన్నారు. బట్లర్ రెండు ఫోర్లు కొట్టాడు.
ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 45 రన్స్ చేసింది. జోస్ బట్లర్ (11), సంజు శాంసన్ (11) క్రీజులో ఉన్నారు. శాంసన్ ఓ ఫోర్ బాదాడు.
నాలుగో ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది. జోస్ బట్లర్ (9), సంజు శాంసన్ (5) క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ మొదటి వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 22 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. నాలుగో ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు.
మూడో ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ కోల్పోకుండా 21 రన్స్ చేసింది. జోస్ బట్లర్ (7), యశస్వి జైస్వాల్ (13) పరుగులు చేసారు. ఈ ఓవర్లో యశస్వి భారీ సిక్స్ బాదాడు.
రెండో ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ 7 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (6), యశస్వి జైస్వాల్ (0) పరుగులు చేసారు. ఈ ఓవర్లో బట్లర్ ఓ ఫోర్ బాదాడు.
మొదటి ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ 2 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (1), యశస్వి జైస్వాల్ (0) పరుగులు చేసారు.
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈ రెండింటిలోనూ గుజరాత్ విజయం అందుకుంది. లీగ్ దశలో గుజరాత్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక క్వాలిఫైయర్-1లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మైదానంలో రెండో మ్యాచ్ ఆడుతున్నామని, అందరూ ఎగ్జయిటింగ్‌గా ఉన్నారని రాజస్థాన్ కెప్టెన్ సంజు సాంసన్ చెప్పాడు. జట్టులో ఎలాంటి మార్పు చేయలేదని చెప్పాడు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, లోకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చహల్.