Punjab Kings Vs Royal Challengers Bengaluru Playing XI Dream11 Team Tips: ఐపీఎల్ చివరి దశకు చేరుకునేకొద్ది.. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే దాదాపు చేరిపోగా.. మిగిలిన రెండుస్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఆర్‌సీబీ 7వ స్థానంలో, పంజాబ్ 8వ స్థానంలో ఉన్నాయి. RCB వరుసగా మూడు విజయాలతో జోరు మీద ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో భారీ ఓటమిని చవిచూసిన పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Also Read: Vijay Devarakonda Top Movies: విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆర్‌సీబీ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ధర్మశాల పిచ్ బౌలర్లకు ఎక్కువగా సహకారం అందిస్తుంది. ఫాస్ట్ బౌలర్లు కొత్త బంతితో కొంత సహాయం పొందవచ్చు. టాస్ గెలిచిన జట్లు గత ఐదేళ్లుగా మొదట బౌలింగ్‌ను ఎంచుకుంటున్నాయి. ఇవాళ రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనా వేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచే ఛాన్స్ 56 శాతం ఉందని గూగుల్ ప్రాబబి
తుది జట్లు ఇలా.. (అంచనా)
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్ (కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ , అర్ష్‌దీప్ సింగ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్ , కామెరాన్ గ్రీన్, విల్ జాక్స్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యశ్ ధయాల్, విజయ్‌కుమార్ వైషాక్.
PBKS Vs RCB Dream11 Prediction:
==> వికెట్ కీపర్లు: దినేష్ కార్తీక్, జానీ బెయిర్‌స్టో (వైస్ కెప్టెన్)
==> బ్యాటర్లు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాప్ డుప్లెసిస్, శశాంక్ సింగ్, రజత్ పటీదార్
==> ఆల్ రౌండర్లు: విల్ జాక్స్, సామ్ కుర్రాన్
==> బౌలర్లు: హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, యశ్ దయాల్
Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter