Sachin Tendulkar Remembers 1992 World Cup: దుబాయ్: ఐపీఎల్ 2020 (IPL) 12వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాజస్థాన్ రాయల్స్ (RR) ను 37 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. అయితే... ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టంతో 174 పరుగులు చేసి రాజస్థాన్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. రాజస్థాన్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అయితే.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌ల గెలుపులో ఆటగాడు సంజు శాంసన్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. అయితే.. కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో శాంసన్ బ్యాట్‌తో అద్భుతాలు చేయనప్పటికీ.. అద్భుతమైన క్యాచ్ పట్టి ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో కమిన్స్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గర సంజూ గాలిలోకి ఎగిరి మరి అందుకున్నాడు. ఈ క్రమంలో సంజూ తలకు స్వల్ప గాయమై విలవిలలాడాడు. అయితే దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) స్పందించాడు. శాంసన్‌ను అభినందిస్తూనే.. క్యాచ్ అందుకునే క్రమంలో తలకు దెబ్బతగిలితే.. ఆ నొప్పిని తట్టుకోలేమంటూ సచిన్ ట్విట్టర్ వేదిగా తెలిపాడు.
Brilliant catch by @IamSanjuSamson!
I know how much it hurts when you bang your head like this on the ground. I experienced it in the 1992 World Cup in our match against the WI when I took a catch. #IPL2020 #RRvKKR
— Sachin Tendulkar (@sachin_rt) September 30, 2020
శాంసన్ పట్టిన క్యాచ్ అద్భుతమని.. బంతిని అందుకునే క్రమంలో తలకు దెబ్బతగిలితే ఎంత నొప్పిగా ఉంటుందో తనకు తెలుసంటూ రాశాడు. ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ 1992 ప్రపంచ కప్‌ను గుర్తు చేసుకున్నాడు. వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను కూడా అలాంటి క్యాచ్‌ను పట్టుకోని బాధను అనుభవించానని సచిన్ గుర్తుచేసుకున్నాడు. అయితే కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 9 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు. Also read: Robin Uthappa: విరాట్ కోహ్లీ చెత్త రికార్డును అధిగమించిన రాబిన్ ఉతప్ప