షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ (Ministry of Shipping) పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్’గా మార్పు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
కరోనా లౌక్‌డౌన్ నాటినుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి.. నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా శుభవార్త అందించింది.
బీజేపీ (BJP) కి చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి తప్పుకుంటున్నట్లు అకాలీదళ్ (SHIROMANI AKALI DAL) ప్రకటించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొన్ని రోజుల నుంచి గళం వినిపిస్తున్నారు. ఆ బిల్లులను నిరసిస్తూ.. అకాలీదళ్ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మూడు రోజుల నుంచి వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ (Parliament) అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సభలో విపక్షపార్టీల సభ్యులు ఆందోళన నిర్వహించి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అనుచితంగా ప్రవర్తించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలు జేఈఈ ( JEE ), నీట్ ( NEET )లను కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది.
స్వాతంత్ర్య దినోత్సవం ( Independence Day ) సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ (Ministry of Home Affairs) మెడల్స్‌ను ప్రకటించింది. ఈ పోలీస్ మెడల్స్ ( Police Medals) ను స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందజేయడం ప్రతీఏటా ఆనవాయితీగా వస్తుంది.
తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా.. నిర్ధారణ లేకుండా వీటిని రాసే జర్నలిస్టుల గుర్తింపును (అక్రిడిటేషన్) శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది.
ఆధార్ కార్డుకు ఇంకా దరఖాస్తు చేయని వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. కేంద్ర సమాచార శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీచేసింది.
కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పొందాలంటే అందుకు ఆధార్ తప్పనిసరి చేశారు. రాయితీపై సిలిండర్, చౌక దుకాణాల్లో సరుకులు, ఎరువులు.. ఇలా ప్రభుత్వం అమలు చేసే ఏ పథకానికైనా ఆధార్ కార్డు తప్పనిసరైంది. దీంతో ఆధార్ కార్డు లేని వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకొన్న మోడీ సర్కార్ ఈ మేరకు గడువు పొడగింపు నిర్ణయం తీసుకొంది.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ఒక్కరే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఈ పరిస్థితి మారనుంది. పాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లలను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకుగాను.. ఆస్తులు, జల వనరుల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలకు ఇప్పటి వరకు కేంద్రం ఒకే గవర్నర్ ను కొనసాగిస్తూ వచ్చింది.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ఒక్కరే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఈ పరిస్థితి మారనుంది. పాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లలను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకుగాను.. ఆస్తులు, జల వనరుల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలకు ఇప్పటి వరకు కేంద్రం ఒకే గవర్నర్ ను కొనసాగిస్తూ వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.