విజయనగరంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని పవన్ చేసిన ఆరోపణలపై జిల్లాకు చెందిన మంత్రి సుజయకృష్ణ స్పందించారు.తమ జిల్లాలో మైనింగ్, ఇసుక మాఫియాలు ఉన్నాయంటూ పవన్ ఆరోపణలు సత్యదూరమన్యారు. ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదువుతున్న పవన్ .. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుకొని మాట్లాడాలని పవన్ కు మంత్రి సుజయకృష్ణ ఎద్దేవ చేశారు.
హోదా కోసం పవన్ ఏం చేశారు ?
కాంగ్రెస్ తో దోస్తీ కోసం చంద్రబాబు ప్రయ్నతిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి యనమల స్పందించారు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ఆహ్వానం మేరకే చంద్రబాబు వెళ్లారన్నారు.. అంతేకానీ కాంగ్రెస్ పార్టీ పిలిస్తే చంద్రబాబు వెళ్లారనడం సత్యదూరమని యనమల వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో దోస్తీ ఉండబోదని యనమల తేల్చిచెప్పారు.
ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీదే కీలక పాత్ర
బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడంపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య ఆయన వైసీపీలో చేరిక అంశం పోస్ట్‌పోన్ అయింది. దీంతో కన్నా వైసీపీలో చేరికకు బ్రేక్ పడినట్లు వార్తలు వెలువడ్డాయి.
విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాదయాత్ర సందర్భంలో కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే పోరాడుతూ వచ్చిన టీడీపీ..ఇప్పుడు ఏకంగా గవర్నర్ వ్యవస్థపైనే గురిపెట్టింది. గవర్నర్ గిరిని రద్దు చేయలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. ఉన్నట్లుండి టీడీపీ ఎందుకు ఇలా విమర్శలు చేస్తోంది.. ఇంతకీ గవర్నర్ చేసిన తప్పేంటని అనుకుంటున్నారా .. అయితే వివరాల్లోకి వెళ్లండి.. మీకే అర్థమౌతుంది..
ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని జగన్ పాటిస్తున్నారని దయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న ధోరణిలో వైసీపీ వ్యవరిస్తోందని ఆరోపించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
జగన్ ఆస్తుల కేసును డీల్ చేసిన సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ మనందరికీ పరిచయమున్న పేరు. ఇప్పటికే పలు సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన రాజకీయాల్లో వస్తారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గతంలో మీడియా అడిగిన ప్రతీసారి ఆయన సమాధానం దాటవేసే వారు. ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. శనివారం విశాఖ వచ్చిన ఆయన సీతమ్మధారలోని వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన పొలిటికల్ ఎంట్రీపై స్పందిస్తూ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతానో బాగా ఆలోచించుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై స్పందిస్తానని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచనలమే..అది వివాదమే. శుక్రవారం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష సందర్భంలో బాలయ్య ప్రసంగం మరోసారి వివాదాస్పదంగా మారాయి. ప్రధాని మోడీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఏకంగా గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు ఉదయం బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ గవర్నర్ ను కలుసుకున్నారు.
ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు కూర్చున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారు. ధర్మ పోరాటం పేరుతో చేస్తున్న చంద్రబాబు దీక్షకు పార్టీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు శివరామకృష్ణ చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతు ఆయన మెడలో పూలమాల వేసి ఆశీర్వదించారు. టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయిచిన గన్ మెన్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెనక్కి పంపించారు. భద్రతా కారణాల దృష్ట్యా నెల రోజుల క్రితం పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నలుగురు గన్మెన్లను కేటాయించింది. రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు.
బీజేపీ నేత లక్ష్మీపతి APMSDIC పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తన రాజీనామా లేఖను అందించారు. మోడీ కేబినెట్ నుంచి టీడీపీ వైదొలగడం..చివరకు ఎన్డీయే కూటమి నుంచి కూడా బయటికి రావడం వంటి పరిణామాలతో వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా పని చేసిన లక్ష్మీపతి రాజీనామా చేయాల్సి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.