Ayodhya Ram Mandir - Silver Screen Rama: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కల. ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం. ఈ రోజు భవ్య రామ మందిరంలో బాల రాముడుగా ఆ కోదండ రాముడు కొలువు తీరనున్నాడు. రాముడి విషయానికొస్తే..
Sun Rays On Ayodhya Rama Statue: ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయాన్ని కట్టారు. అయితే గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు పడేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Ayodhya Ram Mandir: అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరంలో మరికాసేట్లో బాల రాముడిగా శ్రీరామ చంద్రుడు కొలువు తీరనున్నాడు. త్రేతా యుగంలో 14 యేళ్లు వనవాసం చేసిన రామయ్య.. ఈ కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరడానికి ఐదు వందల యేళ్లు పట్టింది. మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానంలో కొన్ని కీలక ఘట్టాలు ఏంటో చూద్దాం..
Ayodhya Ram Mandir - Advani Ratha yatra: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి, బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ చేసిన రథయాత్రకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చేసిన రథయాత్రతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణ కల సాకారమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రథయాత్ర రామ మందిరం నిర్మాణంతో పాటు దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేసాయో చూద్దాం..
Ram Mandir consecration: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశమెుత్తం ఎదురుచూస్తోంది. రేపు జరగబోయ ఈ వేడుక కోసం ఒక్క రోజు ముందుగానే సెలబ్రిటీలు అయోధ్య బాటపడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, వివేక్ ఒబరాయ్ అయోధ్యకు బయలుదేరారు.
Ayodhya Ram Mandir Holiday: యావత్ హిందూ సమాజం మొత్తం అయోధ్య రామందిరం ప్రాణ ప్రతిష్టాపనోత్సవం కోసం ఎదురుచూస్తోంది. కోట్లాది మంది భక్తజనులు కనులారా వీక్షించాలని భక్తిపూర్వకంగా నిరీక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక వైభవాన్ని ఇండియా కూటమి బహిష్కరించింది. అయోధ్య వేడుకకు రాలేమని స్పష్టం చేయగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెలవు ప్రకటించడం తమ ఇష్టమని ప్రకటించారు.
Ayodhya Ram Mandir Updates: ఉత్తరప్రదేశ్లోని సూర్యవంశి ఠాకూర్ వంశీయుల ఐదు వందల ఏళ్ల కల నెరవేరింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో మళ్లీ తలపాగాలు ధరించారు. 500 ఏళ్ల క్రితం చేసిన శపథాన్ని రామ మందిర నిర్మాణం వరకు కొనసాగించారు.
Video viral today: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాముడి గురించి చర్చే. జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు. తాజాగా బీహార్ లో రాముడి గురించి కొందరు విమర్శిస్తుండగా అక్కడనున్న స్టేజ్ కూలిపోయి.. పలువురికి గాయాలయ్యాయి.
Ayodhya Live in Theatres: ప్రపంచ నలుమూలలా హిందూవులంతా జనవరి 22వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆరాధ్య దైవం రాముడి దివ్య మందిరం ప్రారంభోత్సవం కనులారా వీక్షించాలని కోట్లాది మంది భక్తులు భావిస్తున్నారు. కానీ వారందరూ ఆలయానికి వచ్చి చూసే అవకాశం లేకపోవడంతో వివిధ చానళ్లు, వివిధ సంస్థలు, ఆలయ ట్రస్ట్ తదితరులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రముఖ మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Ayodhya Ram Mandir: దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా శ్రీ రామ నామమే మారుమోగుతోంది.5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటాలు వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అవుతోంది. ఇక భవ్య రామ మందిరంలో కొలువు తీరనున్న రామ్ లల్లా విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేసారు. అసలు సాలగ్రామం అంటే ఏమిటి ? విగ్రహాల తయారీకి సాలగ్రామాన్ని ఎందుకు ఉపయోగిస్తారు. అయోధ్య బాల రాముడి విగ్రహం తయారీలో ఏ సాలగ్రామాన్ని ఉపయోగించారు.
Sports Celebraties way to Ayodhya: సకల గుణాభిరాముడు అయోధ్యలో కొలువుదీరుతున్న వేళ ఈ ఉత్సవాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు హాజరుకానుండగా.. ఇక క్రీడా రంగం నుంచి ఎవరెవరు వెళ్తున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే క్రీడా ప్రముఖులందరికీ అయోధ్య ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. ఈ ఉత్సవానికి అన్ని రకాల క్రీడా ప్రముఖులు తరలివస్తున్నారని సమాచారం.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో భవ్య రామ మందిరంలో శ్రీరామ చంద్రుడు బాల రాముడుగా కొలువు తీరనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు నిర్ణయించిన ముహూర్తం ఎలాంటిది.. ఈ సుమూహూర్తానికి ఉన్న బలా బలాలేమిటి ?
Ayodhya Ram Mandir: మరికొన్ని గంటల్లో అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో బాల రాముడిగా జగదేకవీరుడైన శ్రీరాముడు కొలువు తీరనున్నారు. ఈ వేడుకను కనులారా వీక్షించడానికి ఎంతో మంది రామ భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ స్వామిజీ పాల్గొనబోతున్నట్టు వస్తున్న వార్తలపై శృంగేరి పీఠం క్లారిటీ ఇచ్చింది.
Ayodhya Ram Mandir:దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా రామ నామమే మారుమోగుతోంది.5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటం వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారం అవుతోంది. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున (జనవరి 22న) ప్రజలు విధిగా ఆచరించాల్సిన పనులను అయోధ్య రామ మందిర తీర్ధ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ఇంతకీ ఏయే పనులు చేయాలో చూద్దాం..
Ayodhya Ram Mandir: శతాబ్దాల కల.. దశాబ్దాల పోరాటం ఫలిస్తోంది.. యావత్ హిందూ ప్రజలు గర్వించే క్షణాలు.. తన్మయత్వం పొందే ఘడియలు వచ్చేశాయి. ఎన్నో వసంతాల నిరీక్షణ ఫలించి అయోధ్య రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. సుందరమూర్తి రామయ్యను చూసి భక్తజనం పులకించింది. అయోధ్య రామాలయంలో ప్రతిష్టించే బాలరాముడి దివ్యరూపం దర్శనమిచ్చింది. అయోధ్య రామయ్య విగ్రహ విశేషాలు చదవండి.
Ayodhya Ram Mandir:దేశ వ్యాప్తంగా రామ నామం మారుమోగిపోతుంది. అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారమయ్యే ఈ వేళలో రామ భక్తులు గుర్తు చేసుకుంటున్నారు ఓ పేరును. ఇంతకీ ఎవరు అతను ? అయోధ్య రామ మందిర నిర్మాణం వెనక ఆయన పాత్ర ఏమిటో తెలుసుకుందాం..
Ayodhya Rammandir: మరో నాలుగు రోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అయోధ్యకు సంబంధించి ఆసక్తికరమైన కథనాలు, అంశాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అలాంటి అంశం ఒకటి మీ కోసం..
Ayodhya Ram Mandir: హిందూవులంతా ఎదురుచూస్తున్న అద్భుత సమయం ఆసన్నమవుతోంది. శతాబ్దాల కల.. దశాబ్దాల పోరాటం ఈనెల 22న సాకారం కానుంది. దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట వేడుకకు చాలా రాష్ట్రాలు సెలవు ఇవ్వగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరి తెలుగు రాష్ట్రాలు కూడా ఇస్తాయో లేదో అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రాలు ప్రకటించకపోతే కేంద్ర ప్రభుత్వమే జాతీయ సెలవు దినం ప్రకటించే అవకాశం కూడా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.