Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Bandi Sanjay Slams KCR, MIM : ఆదిలాబాద్‌లో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ, చనకా కొరటా ప్రాజెక్టు నుండి కమీషన్లు వెళ్లాయే తప్ప చుక్క నీరెందుకు ఇవ్వలేదు ? ఈ జిల్లా మంత్రి మిస్టర్ 40 పర్సంటేజ్ కమీషన్ల మినిస్టర్‌గా మారిపోయాడు. అందుకే వేల కోట్లు పోగేసుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారా..? ప్రధాని మోదీ ఎవరి పేరు చెప్పనున్నారు..? ఢిల్లీలో జరగబోయే కార్యవర్గ సమావేశాల్లో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 20న జేపీ నడ్డా పదవీ కాలం ముగుస్తుంది
JP NADDA: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హన్మకొండ సభలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను నయా నిజాంతో పోల్చిన జేపీ నడ్డా.. నిజాంను సాగనంపేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రాయ యాత్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ చీకట్లోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిపోయిందన్నారు జేపీ నడ్డా.
JP NADDA MEETING: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. సాయంత్రం హన్మకొండలో జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు.
Munugode By Election: మునుగోడు ఉప ఎన్నిక సామాన్య జనాలకు ఉపాధిగా మారింది. పార్టీల ప్రచారాలు, బహిరంగ సభలు జనాలకు కూలీ కల్పిస్తోంది. వ్యవసాయ పనులకు వేళ్లే కూలీలు కొన్ని రోజులుగా పార్టీల పనికి వెళుతున్నారు. సభకు వెళ్లినా, ప్రచారానికి వెళ్లినా ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు. దీనికి మందు, బిర్యానీ అదనం. పురుషులకు నగదుతో పాటు బీరు, బిర్యానీ అందిస్తున్నారు
BJP Target Kcr: సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఆపరేషన్ మొదలు పెట్టింది బీజేపీ. మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమైంది చేరికల కమిటి. దీనికి చైర్మెన్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.టీఆర్ఎస్ లోని బలమైన నేతలు, అసమ్మతి నేతలతో ఈటల మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
CM KCR: కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని కమలం నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు.. దిమ్మతిరిగే షాకిచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
TRS VS BJP: సీఎం కేసీఆర్ ఆరోపణలు, టీఆర్ఎస్ ఫ్లైక్సీ రాజకీయాలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ సీరియస్ గా ఉన్నారనే ప్రచారం సాగింది. పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్ టార్గెట్ గా ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుందని అంతా భావించారు.
BJP MEETING: సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది
Rain Alert: పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో ఉత్సాహంగా ఉన్న తెలంగాణ కమలనాధులకు కలవరపడే వార్త చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Gaddar Meet Amit sha: గద్దర్ వ్యవహారశైలిలో మార్పు వచ్చింది. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం సంచలనంగా మారింది. కరుడుగట్టిన వామపక్ష వాదిగా ఉన్న గద్దర్.. కరుడుగట్టిన కాషాయవాదిని కలుసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాశంగా మారింది.
Errabelli Dayaker Rao: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా విరుచుకుపడుతున్నారు.
Amit Sha On Bandi Sanjay:తుక్కుగూడ బహిరంగ సభలో బండి సంజయ్ ని ఆకాశానికెత్తారు అమిత్ షా. బడుగు, బలహీన వర్గాల కోసమే ప్రజా సంగ్రామ యాత్ర సాగిందన్నారు. కేసీఆర్ ను ఓడించడానికి తాను తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఢిల్లీలో భేటీ కానున్నారు.
ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. కాగా గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ సీఎంల ఎంపికే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగునుంది. పార్టీ నేతల అభిప్రాయం అనంతరం ప్రధాని మోడీ ..ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎం అభ్యర్ధులను ప్రకటిస్తారు.
ఇటీవలే జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై ఆ రోజు నిర్ణయం తీసుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.