Black fungus cases in India: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య మొత్తం 28,252 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్ధన్ తెలిపారు. అందులో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా 42 శాతం కేసులు నమోదయ్యాయి. షుగర్ వ్యాధితో బాధపడుతూ కరోనా సోకిన వారికి అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ (overintake of steroids) ఇచ్చినట్టయితే, వారు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.
Granules india to supply 16 cr Paracetamol 500 mg tablets: హైదరాబాద్: కరోనాపై పోరులో తమ వంతు కృషిగా తెలంగాణ ప్రభుత్వానికి 16 కోట్ల పారాసిటమోల్ ట్యాబ్లెట్స్ ఉచితంగా అందివ్వనున్నట్టు పారాసిటమోల్ ట్యాబ్లెట్ల తయారీలో పేరున్న ఫార్మాసుటికల్ కంపెనీ అయిన గ్రాన్యుయెల్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఈ ట్యాబ్లెట్స్ విలువ 8 కోట్లు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Dr Anthony Fauci recommended complete lockdown in India: న్యూ ఢిల్లీ: భారత్‌లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఉందని అమెరికాకు చెందిన టాప్ మెడికల్ ఎక్స్పర్ట్, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డా ఆంథోని ఫాసీ అన్నారు. భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతుండంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన డా ఆంథోని ఫాసీ.
Doctor got suspended for demanding money for Corona test: సూర్యాపేట: పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో కరోనా టెస్టు కోసం వచ్చిన వారు 500 రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ కరోనా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన డాక్టర్ క్రాంతి కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
Coronavirus second wave: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,73,810 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
Overweight or obese among COVID-19 patients: కరోనావైరస్ యావత్ ప్రపంచానికి పరిచయమై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో విషయాలు అనుభవంలోకి వచ్చేశాయి. కరోనా ఎలా సోకుతుంది, ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది, కరోనావైరస్కు ఎలా చెక్ పెట్టవచ్చు లాంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నాం.
Side effects of COVID-19 | కరోనావైరస్ సోకి నయమైన తర్వాత దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్, నాడీ వ్యవస్థ సమస్యలు, తల పట్టేసినట్టు ఉండటం, ఆకలి లేకపోవడం, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలే చాలా మందికి తెలిసినవి... చాలా మంది చెప్పుకుంటున్నవి.
భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో చాలామంది కీలక నేతలు, ప్రజప్రతినిధులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
కరోనావైరస్ను (Coronavirus ) శునకాలు పసిగడతాయా అంటే అవుననే అంటోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం. జాగిలాలు పట్టుకున్న వారిలో కరోనా లక్షణాలు గుర్తిస్తుండటం గమనార్హం.
Journalist Manoj died of COVID-19 | హైదరాబాద్, జూన్ 10 : కరోనావైరస్తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన హైదరాబాద్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అని ఆరోపించారు ఆయన సోదరుడు సాయినాథ్. గాంధీ ఆస్పత్రిలో ఉన్న లోపాలపై సాయినాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ పేషెంట్స్‌ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆరోపించారు.
కరోనావైరస్ (COVID-19) దాడి తీవ్రరూపం దాలిస్తే.. ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని క్వారంటైన్ సేవలు (Quarantine) అందించేందుకు 20,000 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలని భారతీయ రైల్వే (Indian Railways) నిర్ణయించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.