Iqoo Neo 9S Pro Price: ప్రముఖ చైనీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ (iQoo) మొబైల్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ధరలోనే తరచుగా గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడంతో చాలా మంది యువత వీటిని కొనుగోలు చేశారు. అలాగే గతంలో లాంచ్ చేసిన iQoo Neo సిరీస్‌కి ప్రత్యేక గుర్చింపు లభించడంతో ఇదే సిరీస్‌లో కొత్త కొత్త మోడల్స్‌తో మరి కొన్ని మొబైల్స్‌ను విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఇప్పటికే కంపెనీ చైనాలో iQoo Neo9S ప్రో మొబైల్‌ను కూడా లాంచ్ చేసింది. దీనిని iQoo Neo సిరీస్‌కి సక్సెసర్‌గా లాంచ్ చేసిన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే చైనా మార్కెట్‌లోకి లాంచ్ అయిన iQoo Neo9S ప్రో స్మార్ట్‌ఫోన్ MediaTek చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో కంపెనీ లాంచ్ చేసింది. ఈ మొబైల్ 16GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది Android 14పై రన్ అవుతుంది. అలాగే 5160 mAh బ్యాటరీ సెటప్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇవే కాకుండా అనేక అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంది.
ఇక iQoo Neo9S Pro స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్ బేస్ వేరియంట్ ధర రూ.34,540 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో వచ్చింది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే సెటప్‌తో లభిస్తోంది. అంతేకాకుండా దీని స్క్రీన్ 2800x1260 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ డిస్‌ప్లే గరిష్టంగా 1400 నిట్స్ గరిష్ట ప్రకాశవంతమైన బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
iQoo Neo9S Pro స్మార్ట్‌ఫోన్ చిప్‌సెటప్ వివరాల్లోకి చూస్తే, ఇది ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 9300+ చిప్‌పై రన్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఇది 16GB ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌ను కంపెనీ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంచింది. ఇది ప్రస్తుతం చైనా మార్కెట్‌లో 256GB, 512GB స్టోరేజ్‌తో పాటు 1TB ఆప్షన్స్‌తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ 16MP సెల్ఫీ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా దీని బ్యాక్ సెటప్‌లో 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 50MP ప్రధాన కెమెరాలను కలిగి ఉంటుంది. ఇవి f/1.88 ఎపర్చర్స్‌ను కలిగి ఉంటాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి