OnePlus Buds 3 Pro Price: ప్రస్తుతం చాలా మంది యువత ఇయర్‌బడ్స్‌ను వినియోగిస్తున్నారు. ప్రీమియం బిల్ట్ క్వాలిటీతో కూడిన అతి చౌక ధరల్లో లభించే ఇయర్‌బడ్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా బ్రాండ్ ప్రీమియం సౌండ్ క్వాలిటీతో మార్కెట్‌లోకి కొత్త కొత్త ఇయర్‌బడ్స్‌ను విక్రయిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కూడా కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ OnePlus బడ్స్ 3 ప్రో అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది అద్భుతమైన టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ OnePlus బడ్స్ 3 ప్రో ఇయర్‌బడ్స్ డ్యూయల్ కనెక్షన్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు EQ సెట్టింగ్‌లతో పాటు తక్కువ-లేటెన్సీ గేమింగ్ మోడ్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ప్రీమియం ఆడియో అనుభూతిని పొందడానికి ప్రత్యేకమైన స్పీకర్స్ సెట్‌ను కలిగి ఉంటుంది. ఇవేకాకుండా తక్కువ-లేటెన్సీ గేమింగ్ మోడ్‌లను కూడా ఈ ఇయర్‌బడ్స్ కలిగి ఉంటాయి. అలాగే ఇవే కాకుండా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
OnePlus బడ్స్ 3 ప్రో ధర:
ఈ OnePlus Buds 3 Pro ఇయర్‌బడ్స్‌ను కంపెనీ అత్యధిక తగ్గింపుతో ధరలోనే విక్రయిస్తోంది. ఇక ఈ ఇయర్‌బడ్స్ వివరాల్లోకి వెళితే, వన్‌ప్లస్ దీనిని ధర రూ.13,999తో విక్రయిస్తోంది. అయితే దీనిని వివిధ ఈ కామర్స్ కంపెనీల్లో కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో రూ. 11,999తో అందుబాటులో ఉంది. అలాగే ఇది రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇది మిడ్‌నైట్ ఓపస్, లూనార్ రేడియన్స్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అయితే దీనిని వన్‌ప్లస్ కంపెనీ భారత్‌లో ఆగస్టు 23 నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ కామర్స్ కంపెనీల్లో అందుబాటులోకి వస్తే ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్‌తో లభించనుంది.
OnePlus బడ్స్ 3 ప్రో స్పెసిఫికేషన్స్:
ఈ OnePlus Buds Pro 3 ఇయర్‌బడ్స్ ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 50dB వరకు అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే దీనిని వన్‌ప్లస్ గతంలో లాంచ్ చేసిన మోడల్స్ కంపెనీ ఇందులో ప్రత్యేకమైన అప్‌గ్రేడ్స్‌తో అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ డ్రైవర్లను కూడా కలిగి ఉంటుంది. ఇది 11mm వూఫర్‌తో పాటు 6mm ట్వీటర్, డిజిటల్-టు-అనలాగ్ కన్వర్టర్ (DAC)తో అందుబాటులోకి వచ్చింది.
ఇతర ఫీచర్స్:
IP55 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
43 గంటల పాటుప్లేబ్యాక్
ఛార్జింగ్ కేస్ సపోర్ట్
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)
వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌లో 5.5 గంటల ప్లేబ్యాక్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.