OnePlus Nord 4: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కస్టమర్స్‌కి మరో శుభవార్త తెలపబోతోంది. ఎంతో ప్రముఖ్యత కలిగిన నార్డో సిరీస్‌ను ఆప్డేట్ వేరియంట్‌లో లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Nord 4 పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్‌కి మంచి గుర్తింపు రావడంతో ఈ Nord 4 మోడల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ అతి శక్తివంతమైన 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. ఈ బ్యాటరీని Oga Group అనే సంయుక్త పరిశోధన ద్వారా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇలా బ్యాటరీ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన Ace 3 ప్రో మోడల్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది శక్తివంతమైన 6100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ Nord 4 స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ Oneplus Nord 4 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన అభివృద్ధి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ లాంచింగ్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వచ్చే సంవత్సరంలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ అయితే నార్డ్ సిరీస్‌లో శక్తివంతమైన ఫోన్‌గా అవతరించే ఛాన్స్ కూడా ఉంది. అయితే వన్‌ప్లస్ త్వరలోనే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా వెల్లడించే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో డబుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కొత్త బ్యాటరీ సిలికాన్ మెటీరియల్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని బ్యాటరీ పరిమాణం చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా ఎంతో శక్తివంతంగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి