Oppo A60 Price: శక్తివంతమైన 50MP కెమెరాతో Oppo A60 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!

Oppo A60 Price: త్వరలోనే Oppo A60 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ తెలుసుకుందాం.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 24, 2024, 04:51 PM IST
Oppo A60 Price: శక్తివంతమైన 50MP కెమెరాతో Oppo A60 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!

 

Oppo A60 Price: ప్రీమియం కెమెరాలతో లాంచ్‌ చేసే మొబైల్స్‌లో ఒప్పో కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. మీరు కూడా మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఒప్పో నుంచి మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది కూడా అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది గతంలో లాంచ్‌ చేసిన A సిరీస్‌కి అప్డేట్‌ వేరియంట్‌లో విడుదల కాబోతోంది. దీంతో పాటు కంపెనీ దీనిని 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. కంపెనీ త్వరలోనే విడుదల చేయబోయే కారును A60 మోడల్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

డిజైన్, ప్రత్యేకమైన రంగులు:
ఈ Oppo A60 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన స్క్రీన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది పంచ్-హోల్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు కింది భాగంలో పెద్ద బెజెల్స్‌తో రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ కాబోతోంది. అంతేకాకుండా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌లో రాబోతోంది. అలాగే ఈ మొబైల్‌ అనేక శక్తివంతమైన ఫీచర్స్‌తో లభించబోతోంది. 

OPPO A60 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
OPPO A60 స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ Google Play కన్సోల్ డేటాబేస్ లిస్టింగ్‌లో కనిసించాయి. ఈ మొబైల్‌ శక్తివంతమైన 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు దీని డిస్ల్పే 90Hzకు సపోర్ట్‌ చేస్తుంది. 

ఒప్పో A60 టాప్ ఫీచర్లు:
డిస్‌ప్లే:

6.5-అంగుళాల HD+ (1600 x 720) LCD డిస్‌ప్లే
20:9 కారణ నిష్పత్తి
90Hz రిఫ్రెష్ రేట్

ప్రాసెసర్, ర్యామ్‌:
Qualcomm Snapdragon 680 ప్రాసెసర్
6GB RAM

కెమెరాలు:
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్:
50MP ప్రైమరీ కెమెరా
2MP మాక్రో కెమెరా
2MP డెప్త్ కెమెరా
8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్

ఇతర ఫీచర్లు:
Android 11 ఆపరేటింగ్ సిస్టమ్
ColorOS 11.1 UI
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
డ్యూయల్ సిమ్ 4G
Wi-Fi 5
బ్లూటూత్ 5.1

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News