Realme Buds Air 6 launch: Realme కంపెనీ కొత్తగా Realme Buds Air 6 ఇండియాలో లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్లకు ఉన్నట్టే రియల్ మి బడ్స్‌కు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఎయిర్ 6 కేవలం 12.4 ఎంఎం డ్రైవర్‌లో ఇమిడిపోయిండటం వల్ల చాలా అనువుగా ఉంటుంది. ఈ బడ్స్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.
Realme Buds Air 6 TWS ఇన్ ఇయర్ డిజైన్ కలిగి ఉండి యాక్టివ్ వాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో ఉంటుంది. గేమింగ్ సమయంలో సౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇందులో 55 ఎంఎస్ లాటెన్సీ ఉంది. ఒక్కో ఇయర్ బడ్‌లో మూడు మైక్రోఫోన్స్ ఇన్‌స్టాల్ అయి ఉండటంతో 50 డెసిబుల్ వరకూ వాయిస్ నాయిస్ తగ్గిపోతుంది. దీంతోపాటు ఇంటెలిజెంట్ డైనమిక్ వాయిస్ క్యాన్సిలేషన్, డీప్ నాయిస్ రిడక్షన్, మోడరేట్ నాయిస్ రిడక్షన్, మైల్డ్ నాయిస్ రిడక్షన్ వంటి రకరకాల ప్రత్యేకతలు ఈ బడ్స్ సొంతం. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.3 ఉంటుంది. వాయిస్ అసిస్ట్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి లెటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఐపీ55 రేటింగ్ ఉండటంతో దమ్ము, ధూళి, నీటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది.
Realme Buds Air 6 బ్యాటరీ కూడా 58 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉండటంతో ఏఎన్‌సి ఆన్ చేస్తే 5 గంటలు కాలింగ్ టైమ్ ఉంటుంది. అదే ఏఎన్‌సి ఆఫ్ చేస్తే 40 గంటలు మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఛార్జింగ్ కేస్ మాత్రం 460 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉండటం వల్ల ప్రయాణాల్లో ఇబ్బంది తలెత్తదు.
రియల్ మి ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌లలో మే 29 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. లాంచింగ్ ధర 3299 రూపాయలు కాగా ప్రత్యేక ఆఫర్లతో 2999 రూపాయలకు పొందవచ్చు.
Also read: PF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, అవసరమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook