Aghori Family: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరీని పోలీసులు ఎట్టకేలకు ఇంటికి చేర్చారు. అయితే ఆమెను కుటుంబసభ్యులు ఇంట్లోకి రానివ్వమని చెప్పడంతో అందరికీ షాక్ తగిలింది. దుస్తులు లేకుండా నగ్నంగా ఉన్న అఘోరీని ఎలా రానిస్తామని కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అఘోరీ స్వగ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీపావళి పండుగ రోజు అఘోరీ స్వగ్రామంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Also Read: Telangana DA: తెలంగాణ 3.64 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల.. ఎప్పటి నుంచి వర్తింపు అంటే..?
సనాతన ధర్మం పరిరక్షణ కోసం తాను పోరాడుతున్నానని.. తనపై జరుగుతున్న వివాదం, దుష్ప్రచారంతో తాను కారులోనే దహనమైపోతానని ప్రకటించడంతో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అఘోరీ స్వగ్రామమైన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నల మండలం కుశ్నపల్లికి గురువారం రాత్రి తీసుకొచ్చారు.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
అఘోరీ రాకతో ఆ గ్రామంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. తమకు పోలీసులు అఘోరీని అప్పగించగా కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. శరీరంపై ఒక్క నూలు పోగు లేకుండా నగ్నంగా ఉన్న అఘోరిని ఎలా ఇంట్లోకి రానిస్తామని ప్రశ్నించారు. కాగా అఘోరీ రాకతో గ్రామంలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఒక్క కెమెరా కూడా అక్కడ ఉండకుండా చేశారు. కుటుంబసభ్యులతోపాటు పోలీసులు కూడా కెమెరాలకు అనుమతినివ్వకపోవడంతో అఘోరి పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియడం లేదు.
గ్రామ సరిహద్దులో అఘోరీ అన్నదమ్ములతోపాటు గ్రామస్తులు కాపలాగా ఉండి మీడియాను గ్రామంలోకి రాకుండా అడ్డగిస్తున్నారని సమాచారం. పోలీసులు కూడా వీడియోలు తీయొద్దని చెబుతుండడంతో అక్డ ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు. 'మమ్మల్ని వదిలేయండి' అంటూ అఘోరి సోదరులు మీడియాను విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అఘోరీ కుటుంబం నేతకాని సామాజిక వర్గంగా తెలిసింది. లిపి లేని భాషలో వారు మాట్లాడుతున్నారని.. ఆ భాష ఎవరికీ అర్ధం కావడం లేదని తెలుస్తోంది.
కాగా అఘోరీ ఇంటికి రావడం కుటుంబసభ్యులకు ఏమాత్రం ఆమోదయోగ్యం లేదని సమాచారం. 'వాడేమో బట్టలు లేకుండా ఉన్నాడు. అసలు వాడిని ఎలా ఇంటికి రానివ్వాలి? ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉన్నారు' అని అఘోరి సోదరుడు రమేశ్ చెప్పినట్లు తెలుస్తోంది. అఘోరి సజీవ దహనం అవుతాననే ప్రకటన చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు అంగీకరించారని.. అఘోరి రావడం కుటుంబసభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదని గ్రామస్తులు చెబుతున్న మాట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.