Redmi Note 14 Pro 4G Lunch: ప్రముఖ టెక్ కంపెనీ రెడ్మి మార్కెట్లోకి త్వరలోనే నోట్4 సిరీస్ ను విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌ను చైనాలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ ప్రో సిరీస్ లో అందుబాటులో ఉంది అయితే దీనిని రెడ్మీ కంపెనీ అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికే వరల్డ్ మొబైల్ లాంచింగ్ సంబంధించిన FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. దీంతో లాంచింగ్ కూడా ఖరారు అయిందని కొంతమంది టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో ప్రత్యేకమైన టెక్నాలజీ సెట్ అప్ తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ Redmi Note 14 Pro సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
FCC జాబితాలో తెలిపిన వివరాల ప్రకారం.. Redmi Note 14 Pro 4G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిస్ప్లే సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల FHD+ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్టును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది విభిన్న స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే కంపెనీ మార్కెట్లో వివిధ రకాల స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీ లో దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ లో ఎంతో శక్తివంతమైన బ్యాటరీలను తీసుకురాబోతోంది. ఇప్పటికే 14 ప్రో సిరీస్ కు సంబంధించిన బ్యాటరీ వివరాలను వెల్లడించింది. ఇది 5,500mAh బ్యాటరీతో వస్తోంది. అంతేకాకుండా ఇది స్పీడ్ చార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇవే కాకుండా అనేక రకాల ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ స్టోరేజ్ వివరాల్లోకి వెళ్తే.. రెడ్మీ కంపెనీ సిరీస్ ను ముందుగా మూడు స్టోరేజ్ ఆప్షన్స్ లో విడుదల చేయబోతోంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియెంట్ 8GB+128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ లో రాబోతోంది. ఇక రెండవ వేరియంట్ 8GB+256GB, మూడవ వేరియంట్ 12GB+256GB స్టోరేజ్ ఆప్షన్స్ లో విడుదల కాబోతోంది. ఇవే కాకుండా ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌ను కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ప్రో వేరియంట్ మాత్రం కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ని కలిగి ఉండాలి. ఇందులో ప్రో వేరియంట్స్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెట్ అప్ తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Redmi 14 Pro 5G సిరీస్ ఫీచర్స్:
MediaTek Dimensity 7300 Ultra ప్రాసెసర్
ప్రో+ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్
50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా
2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)
14 ప్రో+లో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.