Samsung Galaxy F55 5G Price Leaked: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సాంసంగ్ నుంచి ఎఫ్ సిరీస్‌లో మరో మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇటీవలే మార్కెట్‌లో లాంచ్ చేసి F సిరీస్ మొబైల్‌కి మంచి ప్రజాదరణ లభించడంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన కంపెనీ అధికారిక ప్రకటన కంటే ముందే పేరు, స్పెషిఫికేషన్స్, ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీక్ అయిన వివరాల ప్రకారం ఇది Samsung Galaxy F55 5G పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ మొబైల్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీంతో పాటు విభిన్న రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్ అయిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్‌తో మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం, అతి త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన మూడు వేరియంట్స్ ధర వివరాల్లోకి వెళితే, మొదటి వేరియంట్ 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ కలిగిన Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.26,999 ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ వేరియంట్ 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ మొబైల్ ధర రూ.29,999లతో అందుబాటులోకి రాబోతోంది. చివరి వేరియంట్, 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ మొబైల్ రూ. 32,999లకే అందుబాటులోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
లీక్ అయిన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ 1000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ కలిగిన 6.7-అంగుళాల సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీని స్క్రీన్ పూర్తి HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అదనంగా విజన్ బూస్టర్ టెక్నాలజీని కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే Snapdragon 7 Gen 1 చిప్‌సెట్‌పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా దీని బ్యాక్ సెటప్‌లో త్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనకాలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్‌తో పాటు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. దీంతో పాటు సెల్ఫీ కోసం ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి