Vivo Y200e Price In India: ప్రముఖ టెక్ కంపెనీ వీవో గుడ్ న్యూస్ తెలిపింది. అతి త్వరలోనే మార్కెట్‌లోకి వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ Vivo Y200e మోడల్‌తో లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. విడుదలకు ముందే ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు లీక్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన ధరను కూడా టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా లీక్ చేశాడు. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లీక్ అయిన వివరాల ప్రకారం ఈ Vivo Y200e స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో(6 GB + 128 GB, 8 GB + 128 GB) లాంచ్ కాబోతోందని తెలుస్తోంది. మొదటి వేరియంట్ 6 GBర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 23999 ఉండే అవకశాలు ఉన్నాయని టిప్‌స్టర్ వెల్లడించాడు. ఇక రెండవ వేరియంట్ విషయానికొస్తే..8 GBర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ధర MRP రూ.25,999 ఉండబోతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ లాంచ్ అయితే ధరలో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం..ఈ Vivo Y200e స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ డిస్ల్పే AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా గరిష్టంగా ఈ మొబైల్ 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. దీంతో పాటు బ్యాక్ సెటప్‌లో LED ఫ్లాష్‌తో కూడిన త్రిపుల్ కెమెరా సెట్‌తో రాబోతోందని తెలుస్తోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌ను కలిగి ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్‌కి ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ Vivo Y200e మొబైల్ 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు Android 14 ఆధారిత Funtouch OS 14పై పని చేయబోతున్నట్లు టిప్‌స్టర్ వెల్లడించారు. మొదట దీనిని కంపెనీ ఆరెంజ్ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter