Again KCR Will Become CM: 'మాటల మనుషులే కానీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు అని అర్థమైంది. తెలంగాణ నలుమూలలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా వ్యతిరేకత నెలకొని ఉంది. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీ' అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్తే కొడతారు. రేవంత్ రెడడి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదు' అని పేర్కొన్నారు.
Also Read: KTR Reaction: ఢిల్లీ ఎన్నికలపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. దాడికి దిగిన కాంగ్రెస్ శ్రేణులు
సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం నుంచి కొందరు నాయకులు పాదయాత్రగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. 'ప్రజలు తిడుతున్న తిట్లకి రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్లు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు.తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు తిడుతున్నారు. ఇంత దుర్మార్గమైన పాలన చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏమున్నదో ఆలోచించుకోవాలి' అని పేర్కొన్నారు.
Also Read: Ration Cards: ప్రజలకు భారీ శుభవార్త.. మీ సేవలో రేషన్ కార్డు దరఖాస్తులు
పేదవాళ్లు బతకవద్దా?
'రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల మనుషులె కానీ చేతల ప్రభుత్వం కాదు అని అర్థమైంది. ఆ పార్టీకి తీవ్రంగా వ్యతిరేకత నెలకొని ఉంది' అని కేటీఆర్ జోష్యం చెప్పారు. '140 ఎకరాల భూముల కోసం కొడంగల్ లోని ఒక ఊరికి 450 మంది పోలీసులను పంపించారు. తెలంగాణలో పేదవాళ్లు బతకవద్దా? కచ్చితంగా వాళ్ళ ఇళ్లు, దుకాణాలను రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు' అని వరుస పరిణామాలపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు తెలంగాణలో పేదవాళ్ల గురించి ఆలోచించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ చేశారని గుర్తుచేశారు.
మళ్లీ అధికారంలోకి
'మీ అందరికీ అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్తాడు. కేసీఆర్ కూడా అంతే! కానీ తప్పకుండా తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వస్తారు' అని మాజీ మంత్రి కేటీఆర్ జోష్యం చెప్పారు. 'అధికారం కోసం పార్టీలు మారే అవకాశవాదుల గురించి మాట్లాడాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు' అని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో కలిసి వచ్చేందుకు ముందుకు వచ్చిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన అనేక అవకాశాలను పదవులను వదులుకొని బహుజన అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్‌తోనే బహుజనుల అభివృద్ధి జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మారని చెప్పారు.
'కాంగ్రెస్, బీజేప ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచిన తెలంగాణకు తెచ్చింది.. దక్కింది శూన్యం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా ఒక్క కాంగ్రెస్ బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు' అని కేటీఆర్ విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీగా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
తాత్కాలికంగా మన చంద్రుడు కేసీఆర్ గారు కూడా మబ్బుల చాటుకే పోయిండు.
ప్రజల ఆశీర్వాదం, బీఆర్‌ఎస్ కార్యకర్తల సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా బీఆర్ఎస్సే వస్తది.. కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితరు.
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/EznJNJPBQg
— BRS Party (@BRSparty) February 8, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter