SLBC Tunnel Incident: తెలంగాణలో జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జాతీయవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగిందని తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం వార్త తెలుసుకున్న ప్రధాని మోదీ ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి వాకబు చేశారు.
Also Read: Bird Flu Case: తెలంగాణలో హై అలర్ట్.. తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో శనివారం ఉదయం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ నేరుగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని.. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి విన్నవించారు. ఈ ప్రమాదంపై సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ఉదయం ప్రమాదం జరిగితే కొన్ని గంటల తర్వాత ఆలస్యంగా తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. మీడియాలో కథనాలు, ప్రసారాలు సాగడంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ప్రమాదంలో చిక్కుకున్న కొంతమంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురాగా.. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్లో చిక్కుకున్నారు. వారిని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ప్రాణాలతో ఉన్నారా?
అగ్నిమాపక, విపత్తు దళం, హైడ్రా సహా అన్ని సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాణ నష్టం సంభవించకుండా వీలైనంత సురక్షితంగా కార్మికులను తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా చీకటి కావడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురైంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఎలా ఉందనేది తెలియడం లేదు. వారు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనేది తెలియకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.