DK Aruna: 'రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి కుట్రలు చేసినా ఢిల్లీ పీఠం మాదే'

DK Aruna Objects Revanth Reddy Delhi Election Comments: ఎవరు ఎన్ని చేసినా దేశ రాజధానిలో విజయం తమదేనని బీజేపీ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనలను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 17, 2025, 11:08 PM IST
DK Aruna: 'రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి కుట్రలు చేసినా ఢిల్లీ పీఠం మాదే'

DK Aruna vs Revanth Reddy: తెలంగాణలో పథకాలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి యథేచ్ఛగా అబద్దాలు ఆడుతున్నాడని మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఎక్కడ పోయినా మళ్లీ పాత పాటే పడుతున్నాడని మండిపడ్డారు. ముంబై, హర్యానాలో చెప్పినట్లే ఢిల్లీలో కూడా అవే అబద్దాలు ఆడుతున్నాడని గుర్తుచేశారు. ఢిల్లీ ప్రజలు రేవంత్ రెడ్డి అబద్ధాలను విశ్వసించడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే  పరిస్థితిలో లేరని ప్రకటించారు. దేశ రాజధానిలో ఈసారి కమలానిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Telangana By Poll: త్వరలో తెలంగాణలో ఎన్నికలు? కేటీఆర్‌ వ్యాఖ్యల వెనుక పరమార్థం ఇదే!

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలను ఎంపీ అరుణ తప్పుబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మరోసారి గుణపాఠం ఖాయమని తేల్చి చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అట్టర్ ప్లాప్ అయ్యిందని.. ఢిల్లీలో పరిపాలన గాడీ తప్పిందని విమర్శించారు. ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు.

Also Read: KT Rama Rao: మోసాలు చేస్తున్న రేవంత్‌ రెడ్డిపై కేసులు పెట్టాలి.. మహిళలకు కేటీఆర్‌ పిలుపు

'ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎవరూ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయం' అని ఎంపీ డీకే అరుణ జోష్యం చెప్పారు. 'ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. అలాంటి వారిని ప్రజలు విశ్వసించరు' అని పేర్కొన్నారు. ఢిల్లీలో హామీలు నెరవేరుస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏమిచ్చారని నిలదీశారు.

'పూర్తిస్థాయి రైతు రుణాలు మాఫీ చేశారా? రైతు భరోసా ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు రూ.2,500 భృతి ఇచ్చారా?' అని రేవంత్ రెడ్డిపై ఎంపీ అరుణ ప్రశ్నల వర్షం కురిపించారు. 'ఏమీ ఇవ్వని రేవంత్ రెడ్డి ఈ ముఖం పెట్టుకొని ఢిల్లీలో వెళ్లి అబద్దాలు ఆడుతున్నారు' అని మండిపడ్డారు. 'కేసీఆర్‌పై వ్యతిరేకతతోనే తప్ప మీరు అధికారంలో కూర్చున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీపై  ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదు' అని ఎంపీ డీకే అరుణ వివరించారు. తాను ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News