Green India Challenge: హైదరాబాద్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సందడి చేశారు. తన సినిమా షూటింగ్‌కు కోసం భాగ్యనగరానికి వచ్చిన నటుడు..గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ అందిస్తుందన్నారు.
మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చాడు. ఏదో ఒక మొక్క నాటామా..పని అయిపోయిందా అనే విధంగా కాకుండా..మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో కళ్ల ముందే చాలా మంది చనిపోతున్నారని..ఇది చాలా బాధాకరమన్నారు సల్మాన్ ఖాన్.
వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనమంతా చెట్లు నాటాలని చెప్పారు. ఆ పనికి ఎంపీ సంతోష్‌కుమార్ ..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా శ్రీకారం చుట్టారన్నారు. దానిని మనమంతా కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని తెలిపారు. తన అభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటాలని పిలుపునిచ్చారు.
పెద్ద మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మొక్కలు నాటడం వల్ల కోట్లాది మందిలో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సల్మాన్ సినిమా బృందంతోపాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్‌రెడ్డితోపాటు ఇతరులు పాల్గొన్నారు.
Also read: Revanth Reddy: ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయండి..కేసీఆర్‌కు రేవంత్ లేఖాస్త్రం..!
Also read:CM Jagan Tour: ఆంధ్రప్రదేశ్‌లో అమ్మ ఒడి మూడో విడత నిధుల విడుదల అప్పుడే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.