Telangana SIT: తెలంగాణలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి చేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 10 మంది పైగా ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ కు ఫస్ట్ చెక్ పెట్టే ప్రయత్నం చేసారు. కానీ అతి పెద్దగా ప్రయోజనం దక్కలేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ వైపు రావడానికి ఇష్టపడలేదు. మరోవైపు కేసీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసును తేల్చడానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు డెడ్ లైన్ విధించింది.
ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పటికే ఫార్ములా ఈ వన్ కేసులో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. తాజాగా హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ లీజు.. టోల్ టెండర్ల వ్యవహారంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో అక్రమాలు జరిగాయని, వాటిని నిగ్గు తేల్చాలనుకుంటోంది. ఈ క్రమంలోనే దర్యాప్తు చేయాలని భావిస్తోంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
టోల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో ఏదో మతలబు ఉందనే కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలోని ఓ కీలక ఉన్నతాధికారి నేతృత్వంలో ‘సిట్’ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.