CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం!

CM KCR: డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 3న ఫలితాలు రానుండగా.. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి వర్గ భేటీ ఏర్పాటు చేశారు.

Last Updated : Dec 1, 2023, 04:08 PM IST
 CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం!

CM KCR: డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 3న ఫలితాలు రానుండగా.. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి వర్గ భేటీ ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడే మరుసటి రోజే ఈ సమావేశం ఏర్పాటు కానుండటంతో సర్వత్రా ఉత్కంఠగా మారగా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

ఎగ్జిట్ పోల్స్ పై సీఎం కేసీఆర్:

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు భరోసా ఇచ్చారు. ప్రగతిభవన్లో తనను కలిసిన నేతలతో పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై నేతలతో చర్చించిన గులాబీ దళపతి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసినట్లు సమాచారం. ఆగంకావొద్దు, పరేషాన్ అవ్వొద్దంటూ ధైర్యం నింపిన కేసీఆర్.. 3వ తేదీన సంబరాలు చేసుకుందామని పిలుపునిచ్చారు.

ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పల్లె పల్లెన, వాడా వాడా ప్రచారాలు హోరెత్తించారు. అయితే నిన్న అసెంబ్లీ పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ పూర్తి కాగా మరికొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ బుత్‌ల వద్ధ భారీగా ఓటర్లు క్యూలో ఉండడం కారణంగా రాత్రి 10 నుంచి 10:20 నిమిషాల వరకు పోలింగ్‌ కొనసాగింది. పోలింగ్‌ క్రమంలో కొన్ని చోట్ల ఇరు పార్టీ మధ్య గొడవలు జరిగిన సంగంతి తెలిసిందే.

నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం మొత్తం  70.66 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. అత్యధికంగా మధ్యహ్నం వరకు పోలింగ్‌ శాతంలో ఆదిలాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పోలింగ్‌ చివరి నిమిషాల్లో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్‌తో యాదాద్రి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్‌ జిల్లా 46.56 శాతం నమోదై చివరి స్థానంలో ఉంది. నియోజకవర్గాల లెక్కల ప్రకారం..మునుగోడు  91.51 శాతం నమోదైనట్లు ఈసీ పేర్కొంది. 

ఎన్నికల పోలింగ్‌ గురువారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో పలు సర్వే ఏజెన్సీలు ఎన్నికల్లో విజయం సాధించే ఎగ్జిట్ పోల్‌ను వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో అనేక నేషనల్ సర్వేలు, మీడియా ఏజెన్సీలు బీఆర్‌కు ఓటమి తప్పవనే ఫలితాలను ఇచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే..అయితే సీఎం కేసీఆర్‌ మాత్రం పక్కా అధికారంలోకి బీఆర్‌ఎస్‌ వస్తుందని ధీమా వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణనయం తీసుకోవడం ఇప్పుడు తెలంగాణాలో చర్చనీయంశంగా మారింది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News