TSRTC PRC Employees: తెలంగాణ ప్రభుత్వం TSRTC ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులకు పే రివిజన్ కమిషన్ ను 21 శాతం పెంచినట్లు ప్రకటించింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పే రివిజన్ కమిషన్‌కు సంబంధించిన వినతిపత్రం సమర్పించారు.
RTC ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పే రివిజన్ కమిషన్ ఇస్తున్నట్లు నేడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి ఉద్యోగుల పే స్కేల్‌ను సవరిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం 2017- పేస్కేల్‌తో పాటు 2021- పేస్కేల్ సవరించాల్సి ఉందని తెలిపారు. పేస్కేల్ -2017 సవరించాలని ఉద్యోగులు కోరారని.. దీంతో ప్రభుత్వం 20% ఫిట్‌మెంట్‌తో PRC ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఈ ఫిట్‌మెంట్‌ను 2017 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2017 నాటి డియర్‌నెస్ అలవెన్స్ 31.1 శాతాన్ని 01-04-2017 నుంచి పే స్థిరీకరణ గురించి విలీనం చేస్తామని వెల్లడించారు.
తాజాగా సవరించిన వేతనాన్ని జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పేస్కేల్-2017 ఏరియర్స్ ఉద్యోగుల రిటైర్‌మెంట్ సమయంలో వడ్డీ లేకుండా అందజేయనుంది. ఉద్యోగులకు PRC పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది రూ. 418.11 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో సర్వీసులో ఉన్న 42,057 మంది ఉద్యోగులతోపాటు 2017 నుంచి పదవీ విరమణ చేసిన 11,014 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అంటే మొత్తం 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి