ED Files Caveat Petition in SC: న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్చి 11న తొలిసారిగా విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మార్చి 16న రెండోసారి విచారణకు రావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదేశించినప్పటికీ.. తన ఆరోగ్యం బాగోలేదనే కారణంతో ఆమె విచారణకు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన సమాధానంపై స్పందించిన ఈడి అధికారులు.. మార్చి 20న విచారణకు రావాల్సిందిగా ఆమెకు మరోసారి నోటీసులు జారీచేశారు.
అయితే, అంతకంటే ముందుగానే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనని విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల తీరును తప్పుపడుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయగా.. మార్చి 24న ఆ పిటిషన్‌పై విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మార్చి 20 కంటే ముందుగానే విచారణ చేపట్టాల్సిందిగా కవిత చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించడంతో ఈ కేసులో కవితకు తొలి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇదిలావుండగా తాజాగా ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విషయంలో తమ వాదనలు వినకుండానే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయకూడదని విజ్ఞప్తి చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈడి వైఖరిని తప్పుపడుతూ సుప్రీం కోర్టుకు వెళ్లిన కవితకు ఝలక్ ఇస్తూ ఈడి సైతం సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఆమెకు ప్రతికూల అంశంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమపై చేసిన ఆరోపణలకు అదే కోర్టులో సమాధానం ఇవ్వాలనే దృఢ నిశ్చయంతోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం కెవియట్ పిటిషన్ రూపంలో తమ వైఖరిని చాటుకున్నారని.. ఈ కేసులో ఏ మాత్రం తగ్గేది లేదనే ఉద్దేశంతో ఉండటం వల్లే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ విధంగా వ్యవహరించింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈడి తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ఈడి నుంచి వివరణ తీసుకోకుండా సుప్రీం కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే అవకాశం లేకపోవడమే కవితకు ఎదురైన కొత్త ట్విస్ట్ అని ఈ కేసును దగ్గరిగా పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి : VC Sajjanar Alert: యువతీయువకుల్లారా మాయలో పడకండి, మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి
ఇది కూడా చదవండి : Woman commission Serious: బండిపై మహిళా కమిషన్ సీరియస్.. ఆ వీడియోలు పెట్టి విచారణలో వివరణ.. హెచ్చరికలు జారీ!
ఇది కూడా చదవండి : Revanth Reddy Slams KTR: మేము తెలంగాణ ఇయ్యకుంటే మీరు బిచ్చమెత్తుకోవాల్సి వచ్చేదన్న రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK