Ganesh Chaturthi 2021: హుస్సేన్ సాగర్‌లో PoP idols నిమజ్జనంపై హై కోర్టు కీలక ఆదేశాలు

Telangana High court on Ganesh chaturthi 2021: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో (Ganesh Chaturthi 2021) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని హై కోర్టు స్పష్టంచేసింది.

Written by - Pavan | Last Updated : Sep 9, 2021, 05:06 PM IST
  • హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనంపై హై కోర్టు ఆంక్షలు
  • నిమజ్జనం కోసం రబ్బర్ డ్యామ్‌తో ప్రత్యేక ఏర్పాట్లకు ఆదేశాలు
  • వేడుకల విషయంలోనూ కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయన్న కోర్టు
Ganesh Chaturthi 2021: హుస్సేన్ సాగర్‌లో PoP idols నిమజ్జనంపై హై కోర్టు కీలక ఆదేశాలు

Telangana High court on Ganesh chaturthi: హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన వినాయకుడి విగ్రాహలను నిమజ్జనం చేయకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ని (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీని (HMDA), నగర పోలీసులను తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. సాగర్‌లో నీరు కలుషితం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసిన కోర్టు.. నిమజ్జనాల విషయంలోనూ కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. తెలంగాణ హై కోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.ఎస్. రామచంద్ర రావు, టి వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం రిజర్వు చేసిన తీర్పును నేడు గురువారం వెల్లడించింది.

హై కోర్టు ఉత్తర్వులను (Telangana High Court) ప్రభుత్వం అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొస్తూ మామిడి వేణు మాధవ్ అనే అడ్వకేట్ దాఖలు చేసిన కాంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గణేష్ చతుర్థి ఉత్సవాల్లో (Ganesh Chaturthi 2021) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని, అలాంటి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. 

Also read : Ganesh chaturthi in AP: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై AP High court నిర్ణయం

గణేష్ విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ జలాలు (Ganesh idols immersion in Hussain Sagar) మొత్తం కలుషితం కాకుండా సాగర్‌లో ఒక వైపు రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి ఆ పరిధిలోపే విగ్రహాల నిమజ్జనం చేపట్టాలని, నిమజ్జనం అనంతరం సాగర్ అడుగున ఉన్న వ్యర్థాలు, శిథిలాలు తొలగించాలని కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా ట్యాంక్ బండ్ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనానికి అనుతించకుండా పీవీ మార్గ్, నెక్లేస్ రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు వైపు నుంచి విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోర్టు స్పష్టంచేసింది.

దూర ప్రాంతాల నుంచి భక్తులు నిమజ్జనం కోసం విగ్రహాలను (Ganesh idols) హుస్సేన్ సాగర్‌కి తీసుకురావొద్దని, ఎక్కడి విగ్రహాలు అక్కడికి సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేసే విధంగా సర్కారు చర్యలు తీసుకోవాలని కోర్టు తేల్చిచెప్పింది. అంతేకాకుండా చిన్న సైజు విగ్రహాలను భక్తులు తమ ఇంటి వద్దే నీటి బకిట్లలో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా పౌరులకు విజ్ఞప్తి చేసింది.

Also read : Shiva puja vidhi on Monday: శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా ? చంద్రుడి శాపం పోగొట్టిన శివుడి వరం ఏంటి ?

Telangana High court on Ganesh chaturthi:హై కోర్టులో ఆదేశాల్లో ఇంకొన్ని ముఖ్యాంశాలు
రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు రోడ్లపై విగ్రహాలు పెట్టకుండా చర్యలు.
పర్యావరణానికి హానీ కలిగించే వస్తుసామాగ్రితో తయారైన విగ్రహాలను ప్రోత్సహించొద్దు.
కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వినాయక చవితి (Vinayaka Chavithi 2021) సందర్భంగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టొద్దు.
రాత్రి 10 గంటలు దాటిన తర్వాత డీజేలు, మైకులు మోగొద్దు.
కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నివారణకు మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం, శానిటైజర్స్ (Use of masks, sanitizers) వినియోగం వంటి కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

Also read: IRCTC Ramayan tour: శ్రీరామాయణ యాత్ర - పుణ్యక్షేత్రాలు, టికెట్ ధరలు, తేదీల వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News