Medigadda: రిపేర్ చేయలేం.. మేడిగడ్డను కూల్చాల్సిందే.. !

Medigadda: తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణను సాగునీటి రంగంలో ముందు ఉంచాలనే సంకల్పంతో పలు ప్రాజెక్టులను రూపొందించారు. అందులో మేడీగడ్డ బ్యారేజ్ ఒకటి. అయితే తెలంగాణ ఎన్నికల ముందు ఈ బ్యారేజ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో అప్పట్లో దీనిపై పెను దుమారం రేగింది. తాజాగా ఈ బ్యారేజ్ పై నిపుణులు కమిటీ సంచనల రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 16, 2025, 08:36 AM IST
Medigadda: రిపేర్ చేయలేం.. మేడిగడ్డను కూల్చాల్సిందే.. !

Medigadda:ఎపుడు బీడు భూమలుతో ఉండే తెలంగాణ పల్లెలను పచ్చగా మార్చడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయతో పాటు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అందులో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మేడీగడ్డ బ్యారేజ్ ఒకటి. ఈ బ్యారేజ్ కట్టిన రోజులకే పగుళ్లు ఏర్పడటంతో కేంద్ర జలశక్తికి శాఖ చెందిన డ్యామ్ సేఫ్టీ నిపుణులు ఈ డ్యామ్ ను పరిశీలించారు.తాజాగా ఆ నివేదికను తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంజేశారు.

ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్​ను కూల్చి మళ్లీ కట్టాల్సిందేనని  నేషనల్ ​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ అభిప్రాయానికి వచ్చిందని సమాచారం. ఈ మేరకు  కొత్తగా నిర్మించాలంటూ తన  తుది నివేదికలో NDSA నిపుణుల కమిటీ  తెలిపింది. ఏడో బ్లాక్ ​కింద భారీ గుంత ఉన్నదని గుర్తించారు. దాన్ని ఇప్పటికే గ్రౌటింగ తో పూడ్చారన్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

ఈ బ్లాక్ ను  రిపేర్లు చేసినా ఎన్నాళ్లు ఉంటుందన్నది చెప్పలేమని రిపోర్టులో వెల్లడించినట్టు సమాచారం.  కొద్ది వరదకే ఏడో బ్లాక్​ కుంగిందన్నారు. భవిష్యత్తులో భారీ వరద వస్తే అది తట్టుకుంటుందన్న గ్యారంటీ లేదని NDSA నిపుణులు  అభిప్రాయపడుతున్నారని తెలిసింది.  బ్యారేజీ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుచించుకుపోయినట్టు ఉంటుందన్నారు.  ఫలితంగా భారీ వరద వస్తే తన్నుకొచ్చే ప్రమాదం ఎక్కువని పేర్కొన్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News