Abhaya Hastham Scheme: తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం.. A to Z వివరాలు ఇవే

Abhaya Hastham Scheme Guidelines: చేనేత కార్మికుల కోసం ప్రకటించిన తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కానికి సంబంధించిన గైడ్‌లైన్స్ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రిలీజ్ చేసింది. ఈ స్కీమ్‌ కింత నేతన్నలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించనుంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 10, 2025, 10:37 PM IST
Abhaya Hastham Scheme: తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం.. A to Z వివరాలు ఇవే

Abhaya Hastham Scheme Guidelines: తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అమ‌లుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నేడు జీవో జారీ చేసింది. గతేడాది కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాల‌జీ ప్రారంభం సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల స‌మ‌గ్రాభివృద్ధికి ఈ స్కీమ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆర్థిక సంవ‌త్స‌రం (2024-25)లో తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం అమ‌లుకు ఉన్న నిధుల వివరాలను వెల్లడించింది.

==> తెలంగాణ నేత‌న్న పొదుపు (త్రిఫ్ట్ ఫండ్‌)- రూ.15 కోట్లు
  ప‌వ‌ర్‌లూమ్స్, బ‌కాయిల‌కు-రూ.15 కోట్లు
==> తెలంగాణ నేత‌న్న భ‌ద్ర‌త (నేత‌న్న బీమా)-రూ.5.25 కోట్లు 
==> తెలంగాణ నేత‌న్న భరోసా - రూ.31 కోట్లు
   a) వేత‌న ప్రోత్సాహాకాలు (వేజ్ ఇన్సెంటివ్‌)-రూ.31 కోట్లు

తెలంగాణ చేనేత అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం  .

==> ఈ పథకం జియో-ట్యాగ్‌తో అనుసంధానమైన మగ్గాల చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమానికి  రూపొందించింది. ఇది కార్మికుల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంతో పాటు వారికి సామాజిక భద్రత క‌ల్పిస్తుంది. 
==> చేనేత కార్మికులు/అనుబంధ కార్మికులు వారి వేత‌నాల నుంచి దీనికి నెలవారీగా 8 శాతం కాంట్రిబ్యూష‌న్‌ చేస్తారు. కాంట్రిబ్యూష‌న్ గరిష్ట లిమిట్ రూ.1200. ఇందుకు ప్ర‌భుత్వం రెండింత‌లు అధికంగా అంటే 16 శాతం అందిస్తుంది. ==> ==> ఈ స్కీమ్ కింద దీంతో దాదాపు 38 వేల మంది నేత కార్మికులు లబ్ధి చేకూరనుంది. 
==> ఈ పథకం 15 వేల మంది మ‌ర మ‌గ్గాల (ప‌వ‌ర్ లూమ్‌) కార్మికులకూ వ‌ర్తిస్తుంది. మ‌ర మ‌గ్గాల కార్మికులు తమ వేతనం నుంచి నెలవారీగా 8 శాతం జమ చేస్తారు. వారి గరిష్ట పరిమితి రూ.1200. ప్రభుత్వం వారి కాంట్రిబ్యూష‌న్‌కు స‌మానంగా 8 శాతం కాంట్రిబ్యూష‌న్ చేస్తుంది. 
==> రికరింగ్ డిపాజిట్ వ్యవధి మూడు  సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు త‌గ్గింది. 

తెలంగాణ నేత‌న్న భ‌ద్ర‌త (నేత‌న్న బీమా) 

==> తెలంగాణ నేత భ‌ద్ర‌త ప‌థ‌కం  రాష్ట్రంలోని జియో ట్యాగింగ్ అయిన మొత్తం చేనేత, మ‌ర మ‌గ్గాల  కార్మికులు, అనుబంధ కార్మికుల‌కు వ‌ర్తిస్తుంది. 
==> కార్మికుడు ఏ కార‌ణం చేత మృతిచెందినా రూ.5 లక్షల మొత్తం నామినీకి ప్రభుత్వం అందజేస్తుంది. 
==> తెలంగాణ చేనేత కార్మికుల స‌హ‌కార సంఘం ద్వారా బీమా క‌వ‌రేజీ అందజేస్తుంది. ఈ స్కీమ్‌లో ఇప్పటివరకు 65 ఏళ్ల గ‌రిష్ట వ‌యో ప‌రిమితి ఉండగా ఎత్తేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం వ‌ర్తిస్తుంది. 
==> ఈ పథకం అమ‌లుకు ఏడాదికి బ‌డ్జెట్ అంచ‌నా వ్యయం రూ.9 కోట్లుగా ప్రభుత్వం తెలిపింది.
నేత కార్మికులకు వేతన ప్రోత్సాహకం..

ఈ స్కీమ్‌ కింద జియో ట్యాగ్ అయిన మ‌గ్గాల నుంచి నిర్దిష్ట ఉత్ప‌త్తి ప్ర‌మాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గ‌రిష్టంగా రూ.18 వేల వరకు ప్రభుత్వం అందించనుంది. అనుబంధ కార్మికుల‌కు రూ.6 వేలు వేత‌న స‌హాయం అందజేయనుంది. ఈ స్కీమ్‌కు వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.44 కోట్లుగా తెలిపింది.

తెలంగాణ చేనేత మార్క్ లేబుల్

చేనేత‌, సిల్క్ మార్క్ మాదిరే ప్ర‌త్యేక‌మైన లోగో ద్వారా తెలంగాణ‌కు ప్ర‌త్యేక‌మైన చేనేత మార్క్ లేబుల్‌ను ప్రభుత్వం రూపొందించింది. లేబుల్ ద్వారా  తెలంగాణ చేనేత ఉత్పత్తులకు సమ‌ష్టి గుర్తింపును అందించనుంది. స్పెషల్ లోగా ద్వారా "తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్" డిజైన్ చేసింది. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌కు ప్ర‌త్యేకంగా రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదని అధికారులు వెల్లడించారు. జియో ట్యాగ్‌తో అనుసంధాన‌మైన మ‌గ్గాల‌న్నీ వాటంత‌ట‌వే రిజిష్టర్ అవుతాయని..  కొత్త మ‌గ్గాల విషయంలో  తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్ న‌మోదుకు ఆన్‌సైట్ వెరిఫికేష‌న్ చేస్తారని తెలిపారు. తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్  లేబుళ్ల‌కు వార్షిక బ‌డ్జెట్ రూ.4 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ లేబుల్‌లో ఓ వైపు తెలంగాణ హ్యాండ్లూమ్ మార్క్‌తో పాటు 9 అంకెల నంబ‌ర్ ఉంటుంది. ఇందులో మొద‌టి రెండు అంకెలు ఆ జిల్లా/అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కోడ్‌ను సూచిస్తాయి. త‌ర్వాతి రెండు అంకెలు సంవ‌త్స‌రాన్ని రివర్స్‌లో తెలియ‌జేస్తాయి (ఉదాహర‌ణ‌కు 52.. 25 ను సూచిస్తుంది). త‌ర్వాత అయిదు అంకెలు ర‌న్నింగ్ సీరియ‌ల్ నెంబ‌ర్ సూచిస్తాయి. మ‌రోవైపు కార్మికుడు, ఉత్ప‌త్తి వివ‌రాలు ఉంటాయి. 

Also Read: Smriti Mandhana Record: స్మృతి మంధాన రికార్డ్.. భారత తొలి ప్లేయర్​ గా అరుదైన ఘనత   

Also Read: Budget 2025: మహిళలకు భారీ శుభవార్త.. ఫిబ్రవరి 1న కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News