Maha Shivaratri Spl Buses: మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపబోతుంది. ప్రధానంగా శ్రీశైలం మహా క్షేత్రంతో పాటు వేములవాడ, కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం , ఏడుపాయల జాతర, కొమురవెల్లి కి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటితో పాటు భక్తులు దర్శించుకునే అలంపూర్, ఉమా మహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ స్పెషల్ బస్సులు హైదరాబాద్‌లోని మహాత్మ గాంధీ బస్ స్టాండ్, జూబ్లీ బస్ స్టేషన్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెగ్యులర్ సర్విస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
గత ఏడాది శివరాత్రికన్నా ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచుతామన్నారు. మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.