Telangana: తెలంగాణలో ఈసారి జరగనున్న ఎన్నికల్లో సిట్టింగ్లకు షాక్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలో ఈ మేరకు చర్చ జరిగింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ( Ghmc Elections ) అధికార పార్టీ టీఆర్ఎస్కు ఆశించిన మేర సీట్లు దక్కలేదు. సెంచరీ దాటుతామని చెప్పిన పార్టీ..హాఫ్ సెంచరీ దాటి ఆగిపోయింది. ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికలపై పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చ సాగింది.
గెలుపోటములు సహజమని..అదే సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో ప్రయత్న లోపం లేదని కేటీఆర్ ( KTR ) అభిప్రాయపడ్డారు. ఎమోషన్ ఎలక్షన్ జరిగిందని..సిట్టింగులను మార్చిన చోట టీఆర్ఎస్ గెలిచిందని...మార్చని చోట మాత్రం ఓడిపోయామని కేటీఆర్ తెలిపారు. సిట్టింగుల విషయంలోనే లెక్క తప్పిందని..ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదముందని భావించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్ని గుణపాఠంగా తీసుకుందామని చెప్పారు. Also read: GHMC Elections 2020: మేయర్ పీఠం ఎవరిది..మజ్లిస్ మద్దతు ఉండదా
తెలంగాణ రాష్ట్రం ( Telangana state )లో త్వరలో జరగాల్సిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అకాశముందని..సిద్ధంగా ఉండాలని సూచించారు.
మరోవైపు రైతాంగ సమస్యలపై తలపెట్టిన భారత్ బంద్ ( Bharat Bandh ) ను విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా..ఢిల్లీ ( Delhi ) పెద్దల దిమ్మ తిరిగేలా గల్లీ గల్లీ బంద్ కావాలన్నారు. ఈ నెల 8వ తేదీన ఢిల్లీ బంద్కు రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ బంద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm Kcr ) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.