Atiq Ahmed Shot Dead, Accused arrested: ఆతిఖ్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులను ప్రయాగ్‌రాజ్ పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అతిఖ్ అహ్మద్ సోదరులపై కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు కూడా యువకులే.
Atiq Ahmed Shot Dead, Accused arrested: రెండు రోజుల క్రితమే గ్యాంగ్‌స్టర్ ఆతిఖ్ అహ్మద్ తనయుడు అసద్ అహ్మద్‌ని ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు మట్టుపెట్టారు. ఉమేష్ పాల్ అనే న్యాయవాది మర్డర్ కేసులో 19 ఏళ్ల అసద్ అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఉమేష్ పాల్ని చంపాల్సిందిగా హంతకులకు అసద్ అహ్మద్ సుపారీ ఇచ్చినట్టు పోలీసుల వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లోనే అసద్ అహ్మద్ పెళ్లి జరగనుండగా అతడు ఎన్కౌంటర్లో హతమయ్యాడు.