America Mass Shooting Latest Updates: అమెరికాలో కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. మైనే రాష్ట్రంలోని లూయిస్టన్ నగరంలో మూడు వ్యాపార సంస్థలలో బుధవారం రాత్రి జరిగిన సామూహిక కాల్పుల్లో 22 మంది మరణించారు. మరో 50 మందిపైగా గాయపడ్డారు. మూడు చోట్లు కాల్పులు జరిపిన వ్యక్తి ఒక్కరే అని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది అమెరికాలో కాల్పుల ఘటన ఇది 565వది కాగా.. ఈ సంఘటనల్లో మొత్తం 15,000 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం జరిగిన కాల్పుల్లో గాయపడిన 50 మందికి పైగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నవారు ఇంకా షాక్ నుంచి తెరులేకపోతున్నారు.
విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వ్యక్తిని రాబర్ట్ కార్డ్‌గా అధికారులు గుర్తించారు. యూఎస్ ఆర్మీ రిజర్వ్‌లో రైఫిల్‌లో శిక్షణ ఇచ్చే అధికారి అని తెలిపారు. అయితే మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇటీవల సైన్యం నుంచి తొలగించారు. సాకోలోని నేషనల్ గార్డ్ స్థావరాన్ని కాల్చివేస్తానని బెదిరించడంతో విధులను తొలగించి ఇంటికి పంపించారు. తాజాగా 22 మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఘటన జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అమెరికాలో ఈ ఏడాది 500కు పైగా కాల్పుల ఘటనలు వెలుగులోకి రాగా.. బుధవారం రాత్రి జరిగిన ఘటన అతిపెద్దది అధికారులు పరిగణిస్తున్నారు.
నిందితుడు AR-15 నుంచి బుల్లెట్లను పేల్చినట్లు పోలీసులు కొన్ని చిత్రాలను రిలీజ్ చేశారు. చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపించాడు. నిందితుడు ఏఆర్-15 రైఫిల్‌తో ప్రజలపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. AR-15 లైట్ వెయిట్ రైఫిల్ అని.. ఇది ఒక నిమిషంలో 45 నుంచి 100 బుల్లెట్లను కాల్చగలదని చెప్పారు. ఇందులోని నుంచి వచ్చే బుల్లెట్ వేగం చాలా ఎక్కువగా ఉంటుందని.. బుల్లెట్ తగిలితే మనిషి బతకడం కష్టమని చెప్పారు. అవయవాలను నాశనం చేయడంతోపాటు ఎముకలను ముక్కలు ముక్కలు చేసేంత ప్రమాదకరంగా బుల్లెట్ వేగం ఉంటుందన్నారు.
2019 ఆగస్టులో ఒక సాయుధుడు ఎల్ పాసో వాల్‌మార్ట్‌లో దుకాణదారులపై AK-47 రైఫిల్‌తో కాల్పులు జరిపి.. 23 మందిని హత్య చేశాడు. ఆ తరువాత తాజా ఊచకోత యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత ఘోరమైనది. 2017లో లాస్ వెగాస్ కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఎత్తైన హోటల్ పెర్చ్ నుంచి ఒక సాయుధుడు కాల్పులు జరిపి 58 మందిని ప్రాణాలు తీయడం అమెరికాలో అత్యంత ఘోరమైన సామూహిక కాల్పులు ఘటన. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కాల్చి చంపుతున్న ఘటనలు అమెరికాలో పెరుగుతున్నాయి. 2022లో 647 మరణించగా.. 2023లో 679 మంది కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు
Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook