Bharath Vs Canada Update: బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు లింకులు.. మళ్లీ నోరు పారేసుకున్న కెనడా.. 

Bharath Vs Canada Conflicts Update: కెనడా ట్రూడో ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్‌తో కయ్యానికి కాలు దూస్తూ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత ఏజెంట్లకు నేరుగా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో లింక్‌ ఉందని మరోసారి నోరు పారేసుకుంది. ఈ గ్యాంగ్‌తో కలిసి ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని భారత ఏజెంట్లు పనిచేస్తున్నారని సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు కెనడీయన్‌ మౌంటెడ్‌ పోలీసులు.

Written by - Renuka Godugu | Last Updated : Oct 15, 2024, 01:49 PM IST
Bharath Vs Canada Update: బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు లింకులు.. మళ్లీ నోరు పారేసుకున్న కెనడా.. 

Bharath Vs Canada Conflicts: భారత్‌పై అక్కసు కక్కుతూ కేనడా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. నిన్నటి వరకు భారత దౌత్య అధికారులను నిందించిన ట్రూడో ప్రభుత్వం ఇప్పుడు నేరుగా మన భారత ఏజెంట్లపై నోరు పారేసుకుంటుంది. గ్యాంగ్‌ స్టార్‌ లారెన్స్‌ భిష్ణోయ్‌ తో వారికి సంబంధం ఉన్నట్లు  తీవ్ర అభియోగాలు మోపుతోంది కెనడా. వారు ప్రో ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తలు ఆరుగురిపై కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటికే వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడాలో ఉన్న మన దౌత్య వేత్తలపై కూడా వేటు వేసింది. అయితే, ఇప్పటికే మన దౌత్యవేత్తలను తిరిగి భారత్‌కు రప్పించే పని కూడా కేంద్రం ప్రారంభించింది. కెనడా దౌత్యవేత్తలను అక్టోబర్‌ 19వ తేదీ అర్ధరాత్రి 11:59 భారత్‌ విడిచి వెళ్లాలని కూడా సూచించింది.

కెనడాలో దక్షిణాసియాలో ఉంటున్న ప్రో ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుని మన భూభాగంపై నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిన్న మీడియా ముఖంగా ఆర్‌సీఎంపీ కమిషనర్‌ బ్రిగట్టె గౌవిన్‌ వ్యాఖ్యలు చేశారు.  అంతేకాదు ఖలిస్థానీ ఉగ్రవాది అయిన నిజ్జర్‌ హత్య కేసులో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మను కూడా అనుమానితుడిగా చేర్చారు. 

ఇదిలా ఉండగా మరో తీవ్ర ఆరోపణలు చేస్తూ భారత్‌పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలె హత్యకు గురైన బాబా సిద్దిఖీ మర్డర్‌కు లారెన్స్‌ భిష్ణోయ్‌ గ్యాంగ్‌తో లింక్‌ ఉందనే ఆరోపణలు కూడా బయటకు రావడంతో కెనడా ఇప్పుడు భారత ఏజెంట్లతో గ్యాంగ్‌ స్టర్‌ లారెన్స్‌ భిష్ణోయ్‌ గ్యాంగ్‌కు లింక్‌ ఉందని బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు లారెన్స్‌ పేరు హల్‌చల్‌ కావడంతో కెనడా ప్రభుత్వం ఈ గ్యాంగ్‌స్టర్‌ పేరును తెర మీదకు తీసుకు రావడం గమనార్హం.

ఇదీ చదవండి: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1 హాల్‌ టిక్కెట్ల విడుదల.. ఈ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

ఎన్నికల వేళ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది కెనడా. ఓటు బ్యాంకు లక్ష్యంగా ఖలిస్థానీలను వెనుకేసుకు వస్తోంది. అక్కడ 1970 సమయంలోనే ఎంతో మంది ప్రోఖలిస్థానీలు కెనడాలో సెట్టిల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం లారెన్స్‌ భిష్ణోయ్‌ కూడా జైలులో ఉన్నాడు. కానీ, అతడి సోదరుడు, అనుచరలతో బాబా సిద్దిఖీ హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇలా భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం. భారత్‌పై ఆంక్షలు విధించడానికి సైతం సిద్ధమవుతోందట. భారత్‌పై చర్యలు తీసుకోవాలని కెనడా సిక్కుల భద్రతపై న్యూ డెమోక్రాటిక్‌ పార్టీ లీడర్‌ జగ్మీత్‌ సింగ్‌ కూడా ఆరోపణలు చేస్తున్నారు. భారత దౌత్యవేత్తలను బహిష్కరించడం సమర్థనీయం అన్నారు. ఆ దేశ విదేశంగా మంత్రి మెలానీ జోలీ కూడా భారత్‌పై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పకనే చెప్పారు. తీవ్ర విమర్శలు చేస్తూ రెచ్చగొట్టు వ్యాఖ్యలు ఆమె చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: India Vs Canada: భారత్‌ విడిచి వెళ్లిపోండి.. కెనడా దౌత్యవేత్తలపై కేంద్రం వేటు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News