Nikki Haley: నిక్కీ హేలీ సంచలన నిర్ణయం.. అమెరికా అధ్యక్ష పోటీ నుంచి నిష్క్రమణ

Nikki Haley Quites Race: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష రేసు నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ వైదొలిగారు. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 6, 2024, 10:39 PM IST
Nikki Haley: నిక్కీ హేలీ సంచలన నిర్ణయం.. అమెరికా అధ్యక్ష పోటీ నుంచి నిష్క్రమణ

Nikki Haley Quits: అమెరికా అధ్యక్ష స్థానం కోసం బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన నాయకురాలు నిక్కీ హేలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌కు నిక్కీ హేలీ అభినందనలు తెలిపి అందరి ఓట్లు పొందాలని సూచించారు. తాను నమ్మిన అంశాలపై గొంతు విప్పానని తెలిపారు. నిక్కీ హేలీ వైదొలగడంతో అధ్యక్ష స్థానానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రమే బరిలో నిల్చున్నారు. వీరిద్దరి మధ్య అధ్యక్ష పోరు కొనసాగనుంది.

Also Read: Baby Born: విమానంలో పురిటినొప్పులు.. సెల్‌ఫోన్‌లో చూసి 'డెలివరీ' చేసిన పైలెట్‌

సౌత్‌ కరోలినాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిక్కీ హేలీ మాట్లాడారు. 'నా ప్రచారాన్ని నిలిపివేయాల్సిన సమయం వచ్చేసింది. అమెరికన్లు తమ గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నానని తరచూ చెప్పేదాన్ని. నేను అదే పని చేశా. నాకు ఎలాంటి బాధ.. పశ్చాత్తాపం అనేది లేదు. అధ్యక్ష పోటీ నుంచి వైదొలిగినప్పటికీ.. అభ్యర్థిని కానప్పటికీ నమ్మిన అంశాలపై మాత్రం గళాన్ని వినిపించక మానను' అని స్పష్టం చేశారు. అయితే అధ్యక్ష బరిలో ఉన్న బైడెన్‌, ట్రంప్‌ ఇద్దరిలో ఎవరికీ మద్దతు ఇస్తారనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు.

Also Read: Ship Hits Bridge: నౌక ఢీకొడితే దెబ్బకు రెండు ముక్కలైన బ్రిడ్జి.. వామ్మో ఏమిటీ ప్రమాదం

రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష స్థానం రేసులో నిక్కీ హేలీ, డొనల్డ్‌ ట్రంప్‌ నిలిచారు. అయితే అధ్యక్ష బరిలో నిలవాలంటే 1,215 మంది ప్రతినిధుల మద్దతు అవసరం ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం ట్రంప్‌కు 995 మంది మద్దతు ప్రకటించగా.. నిక్కీ హేలీకి మాత్రం 89 మంది మాత్రమే అండగా నిలిచారు. ట్రంప్‌తో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉండడంతో.. ఇక అధ్యక్ష రేసులో నిలవడం అసాధ్యం కావడంతో ఆమె పోటీ నుంచి వైదొలిగారు. ఇటీవల పోటీకి రేసులో వచ్చిన మరో భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. వరుసగా పోటీదారులు వైదొలుగుతుండడంతో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌ అధ్యక్ష బరిలో కొనసాగుతారని స్పష్టమవుతోంది.

ఇక డెమెక్రాట్ల తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఫలితాలను చూస్తే బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. వీరిద్దరూ అందరి కంటే ఎక్కువగా మద్దతు కలిగి రేసులో కొనసాగుతున్నా వీరి అభ్యర్థిత్వం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ట్రంప్‌ ఈనెల 12, బైడెన్‌ ఈనెల 19వ తేదీ వరకు ఆగాల్సిందే. వారి అభ్యర్థిత్వాలు ఖరారైన అనంతరం నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News