Virginia Walmart Store Shooting: అమెరికాలో వరుసగా కాల్పలు ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వర్జీనియాలోని చీసాపీక్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. చాలా మందికి గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటన గురించి సమాచారం అందుకున్న చెసాపీక్ పోలీసులు.. వెంటనే వాల్‌మార్ట్ వద్దకు చేరుకున్నారు.
ఈ ఘటనలో దాదాపు 10 మంది మరణించారని.. చాలా మంది గాయపడ్డారని చెసాపీక్ పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి భవనం నుంచి దూరంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. కాల్పులకు సంబంధించి కారణాలు తెలియరాలేదన్నారు. మంగళవారం రాత్రి 10:12 గంటలకు కాల్పుల గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. వాల్‌మార్ట్ స్టోర్ వెలుపల భారీ పోలీసు బలగాలు మోహరించారు. దీంతో పాటు 40కి పైగా ఎమర్జెన్సీ వాహనాలు కూడా భవనం వెలుపల సిద్ధంగా ఉంచారు.
కాల్పులు జరిపిన వ్యక్తి స్టోర్ మేనేజర్ అని సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు చెప్పారు. మేనేజర్ బ్రేక్ రూమ్‌లోకి ప్రవేశించి ఇతర స్టోర్ ఉద్యోగులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అతను కూడా తుపాకీ తనవైపు తిప్పుకుని కాల్పుకున్నట్లు సమాచారం. దుకాణం లోపల కాల్పులు జరిగినట్లు భావిస్తున్నామని.. అనుమానితుడు ఒంటరిగా ప్రవర్తించాడని అధికార ప్రతినిధి లియో కోసిన్స్కీ తెలిపారు.
అమెరికాలో సామూహిక కాల్పులు ఆగడం లేదు. ప్రతిరోజూ అమెరికాలోని ఏదో ఒక నగరం నుంచి కాల్పుల వార్తలు వస్తున్నారు. రెండు రోజుల క్రితం కొలరాడో స్ప్రింగ్స్‌లోని గే నైట్‌క్లబ్‌లో ఒక దుండగుడు కాల్పుల జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 18 మంది గాయపడ్డారు. తాజాగా జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించడం విషాదాకరం.
Also Read: Minister Malla Reddy: మహేందర్ రెడ్డికి అస్వస్థత.. తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి