మహారాష్ట్ర: సామజిక ఉద్యమకర్త అన్నాహజారే మోడీ సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. రైతు సమస్యలు, లోక్ పాల్ , లోకాయుక్తాలపై ప్రభుత్వ హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ..దీనిపై ఐదురోజుల్లో స్పష్టమైన ప్రకటన చేయకుంటే పద్మభూషణ్ తిరిగి ఇస్తానని కేంద్రానికి హెచ్చరించారు
లోక్ పాల్ బిల్లుపై అన్నాహజరే మరోసారు నిరాహార దీక్ష చేపటుతున్నారు. గత బుధవారం తన స్వస్థలం రాలేగన్ సిద్ధి గ్రామంలో దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టి ఐదు రోజులైనా తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
గతంలో అన్నాహజారే యూపీఏ ప్రభుత్వం అవినీతి పై గళం ఎత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా యూపీఏ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ సర్కార్ పై అన్నాహజారే ఇదే తరహా ఉద్యామన్ని ప్రారంభించడం గమనార్హం. తాజా అల్టిమేటంపై మోడీ సర్కార్ ఈ మేరకు స్పందిస్తుందనేది చర్చనీయంశంగా మారింది
Anna Hazare: I will be returning my Padma Bhushan award to the President. I did not work for that award, you only gave me that while I was working for social cause & the country. If the country or society is in this condition, then why should I keep that? (03.02.19) pic.twitter.com/bch2mmw08o
— ANI (@ANI) February 4, 2019